Site icon NTV Telugu

Lorry Driver Cruelty: లారీ డ్రైవర్ కిరాతకం.. మహిళ మృతి

Women1

Women1

మానవత్వం మంటగలిసిపోతుంది. సభ్య సమాజం ఈసడించుకునేలా వ్యవహరించాడో లారీ డ్రైవర్. గుంటూరులో జరిగిన ఘటన కలకలం రేపింది. ఓ లారీ డ్రైవర్ కిరాతకం ఓ మహిళ మృతికి కారణం అయింది. పిల్లలు అనాథలుగా మారారు. గుంటూరు శివారు నాయుడుపేట జిందాల్ కంపెనీ సమీపంలో ఈ దారుణం చోటుచేసుకుంది. చెత్త కాగితాలు ఏరుకోవడానికి పిల్లలతో కలిసి చిలకలూరిపేట నుంచి వచ్చిందో మహిళ. చిలకలూరిపేట నుంచి గుంటూరుకు లారీలో వచ్చిందా మహిళ.

గుంటూరు శివారు నాయుడుపేట వద్ద లారీ దిగి రూ.100 ఇచ్చింది మహిళ. అయితే తనకు రూ.100 సరిపోవని, రూ.300 ఇవ్వాలని మహిళను డిమాండ్ చేశాడు లారీ డ్రైవర్. తన దగ్గర అంత డబ్బు లేదనడంతో.. పిల్లలను దించకుముందే లారీ ముందుకు నడిపించేశాడు డ్రైవర్. దీంతో పిల్లల కోసం లారీని పట్టుకుని వేలాడుతూ కొంతదూరం వెళ్లిపోయింది మహిళ. కాసేపటికే అదుపు తప్పి లారీ కింద పడి మహిళ రమణ(40) మృతి చెందింది. విషయం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, లారీ డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు. తల్లి మరణంతో పిల్లలు అనాథలుగా మారారు. రూ.300 కోసం మహిళను వేధించిన డ్రైవర్ తీరుపై నిరసన వ్యక్తం అవుతోంది. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

బైక్ దొంగిలించి.. ప్రమాదంలో మృతి

దొంగలు రెచ్చిపోతున్నారు. బైక్ దొంగతనం చేసి ప్రమాదంలో మరణించిన ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం అంగడి బజార్ లో జరిగింది. బజార్‌లో పార్క్ చేసిన బైక్ చోరీ జరిగింది. బైక్ చోరి చేసిన అనంతరం నరేష్ (32)అనే వ్యక్తి అతి వేగంగా నడిపి ప్రమాదానికి గురయ్యాడు. బైక్ అదుపు తప్పి దర్గా వద్ద మెయిన్ రోడ్డుపై పడింది. దీంతో దొంగకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతు ఆస్పత్రి లో బైక్ దొంగ నరేష్ మృతి చెందాడు. బైక్ యాజమాని కాజిం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Crime News: దారుణం.. యాక్సిడెంట్ అయ్యిందని బాలికను లాడ్జీకి పిలిచి..

Exit mobile version