రాష్ట్రంలో ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రకృతి ప్రసాదించిన సంపద ఇసుకను ఇష్టా రాజ్యంగా తవ్వేసి నదులను ఖాళీ చేయడం వల్ల అనేక నీటి సమస్యలు వస్తున్నాయని, దీనిపై పాలకులు ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి అన్నారు. కడప జిల్లా పరిపరిషత్ హాలులో నీటి ప్రాజెక్టులపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించిన జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి రాయసీమ ప్రాజెక్టులు, నీటి పరిస్థితులపై మాట్లాడారు. ఇసుకను తవ్వేసిన నదులల్లో ఇసుక తిన్నెలు లేకుండా చేయడం వల్ల చిన్న చిన్న కాజేవేలు కొట్టుకుపోతున్నాయని, వర్షాకాలంలో నీటిని నిలువ చేసిని భూగర్భం నుంచి ఎండకాలంలో రైతులకు, ప్రజలకు నీరిందించే నదులు నేడు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Vaishnav Tej: నెగిటివ్ రోల్‌లో అయినా నటించేందుకు సిద్ధంగా ఉన్నా
నదుల్లో ఇసుక ఉన్నంత కాలం నీటి సమస్యలు లేవని ఆయన గుర్తు చేశారు. రాయలసీమలో నిర్మించే సాగునీటి ప్రాజెక్టులను వ్యాపార దృష్టితో చూసి ఎన్ని ఎకరాలకు నీరు అందించవచ్చు, ఎంత ఆదాయం వస్తుందన్నఆలోచనతో ముందుకు వెళ్లారు తప్ప, శ్రీశైలంలో నిండుగా నీరున్నా పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీరు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. నీరు వున్నా నిలవ చేసుకునే సామర్ధ్యం, వాటిని వినియోగించుకునే సామర్ధ్యం లేకుండా పోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. పాలకులు భవిష్యత్ ప్రమాదాన్ని అంచనా వేయకుండా వ్యవహరించడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని జస్టిస్ లక్ష్మణ రెడ్డి స్పష్టం చేశారు.
Read Also: JP Nadda meet Mithali Raj: జేపీ నడ్డాతో మిథాలీరాజ్‌భేటీ.. విషయం ఇదేనా..?