Site icon NTV Telugu

ఎంపీ రఘురామ.. మరో ఇద్దరికి లోక్‌సభ నోటీసులు

MP Raghu Rama

MP Raghu Rama

వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు నోటీసులు జారీ చేసింది లోక్‌సభ సచివాలయం… ఆయనతో పాటు తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు సిసిర్‌ అధికారి, సునీల్‌ కుమార్‌లకు కూడా నోటీజులు జారీ అయ్యాయి.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అందిన ఫిర్యాదులపై స్పందించిన లోక్‌సభ సచివాలయం… ఆ ముగ్గురు ఎంపీలకు నోటీసులు జారీ చేసింది. కాగా, రఘురామ కృష్ణరాజుపై ఇప్పటికే పలుసార్లు ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీలు.. లోక్‌సభ స్పీకర్‌ను కలవడం ఫిర్యాదు చేయడం… రఘురామ.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినటువంటి పలు ఆధారాలను సమర్పిస్తూ వచ్చారు. ఇక, ఎంపీలు సిసిర్‌ అధికారి, సునీల్‌ కుమార్‌పై టీఎంసీ ఫిర్యాదు చేసింది.. దీంతో.. ముగ్గురు ఎంపీలకు ఒకేసారి నోటీసులు వెళ్లగా.. 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది లోక్‌సభ సచివాలయం.

Exit mobile version