ఏలూరు జిల్లాలో లాకప్ డెత్ చోటుచేసుకుంది. భీమడోలు పోలీసు స్టేషన్ లో నిందితుడు లాకప్ డెత్ కి గురైనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, నిందితుడు ఉరివేసుకుని మరణించాడంటున్నారు పోలీసులు. ఓ చోరీ కేసులో మూడు రోజుల క్రితం అప్పారావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు భీమడోలు పోలీసులు. సూరప్పగూడెంకు చెందిన అప్పారావు స్టేషన్ లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అప్పారావు బాత్రూమ్ లో ఉరివేసుకున్నాడంటున్నారు పోలీసులు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్నాచింగ్ కేసులో పోలీసులు పట్టుకున్న వ్యక్తి భీమడోలు పోలీస్ స్టేషన్లో రాత్రి లాకప్ డెత్ అయినట్లు చెబుతున్నారు.
ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. అప్పారావు పోలీసు హింస వల్ల మరణించాడా? లేక వ్యక్తిగత కారణాల వల్ల ఉరివేసుకున్నాడా అనేది తేలాల్చి వుంది. ఒకవైపు మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోతున్న వేళ తాజా సంఘటన పోలీసు వారికి తలవంపులు తెచ్చేదిగా వుందంటున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిగితే గానీ వాస్తవాలు బయటకు రావంటున్నారు.
Andhrapradesh Rains: ఏపీలో వర్షాలు… చల్లబడిన వాతావరణం