NTV Telugu Site icon

మందుబాబులకు గుడ్ న్యూస్.. ఏపీలో మద్యం షాపుల పనివేళలు పొడిగింపు

మందుబాబులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల పని వేళలను మరో గంట పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి సర్కార్… ప్రభుత్వ మద్యం దుకాణాల్లో రాత్రి 10 గంటల వరకు తెరుచుకునే వెసులుబాటు కల్పించింది… మద్యం సేల్స్ అకౌంట్ల నిర్వహణకు మరో గంట సమయాన్ని పెంచినట్టు ప్రభుత్వం పేర్కొంది.. రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మద్యం దుకాణాలకు వెసులుబాటు కల్పించింది ఏపీ ప్రభుత్వం.

ముఖ్యంగా మద్యం దుకాణాల వద్ద రద్దీ తగ్గించేందుకు సమయం పెంచినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక సమయాల్లో మినహాయిస్తే.. సాధారణంగా రాత్రి 9 గంటల వరమే మద్యం షాపులు తెరిచే వీలు ఉండగా.. తాజా నిర్ణయంతో రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు పనిచేయనున్నాయి.

Read Also: ఒకరికొకరు థ్యాంక్స్‌ చెప్పుకున్న ఆనంద్‌ మహీంద్రా, కేటీఆర్..