Site icon NTV Telugu

Lightning strikes: పిడుగుపాటుకు నలుగురు బలి

Lightning Strikes

Lightning Strikes

ఆంధ్రప్రదేశ్‌లో పిడుగుపాటుకు నలుగురు మృతిచెందారు.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది.. మృతులంతా కూలీలుగా చెబుతున్నారు.. ఏలూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం బోగోలలో పిడుగు పడి నలుగురు కూలీలు మృతిచెందారు.. జామాయిల్ తోటలో కూలి పనికి వచ్చిన వారిపై తెల్లవారుజామున పిడుగు పడింది.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా మారడంతో.. విజయవాడకు తరలించారు.. జమాల్ తోట నరికేందుకు ఉదయమే పొలానికి వచ్చారు దాదాపు 30 మంది కూలీలు.. వీరిలో ఏడుగురు పిడుగుపాటకు గురయ్యారు.. అందులో నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు.. మృతులు రాయుడు రాజు, కోనపు రెడ్డి శ్రీనివాసు, గుత్తులకొండ బాబుగా గుర్తించారు.. వీరంతా కాకినాడ జిల్లాకు చెందిన కూలీలుగా చెబుతున్నారు.

Read Also: Ghulam Nabi Azad Quits: కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చిన గులాం నబీ ఆజాద్..

Exit mobile version