Site icon NTV Telugu

Lift Accident in VTPS: వీటీపీఎస్‌లో లిఫ్ట్‌ ప్రమాదం.. ముగ్గురు మృతి

Vtps

Vtps

Lift Accident in VTPS: లిఫ్ట్‌ వైర్లు తిగిపోయి.. ఆ లిఫ్ట్‌ కింద పడి ముగ్గురు మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని విజయవాడ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో లిఫ్ట్‌వైర్‌ తెగిపోవడం ఒక్కసారిగా కిందపడిపోయింది.. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.. ప్రమాద సమయంలో మొత్తం ఎనిమిది మంది ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఓవర్‌ లోడ్‌ కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.. ప్రమాదంలో ముగ్గురు కార్మికులు అక్కడిఅక్కడే మృతిచెందగా..మరో ఐదుగురు కార్మికులు గాయాలపాలైనట్టు చెబుతున్నారు.. మొత్తంగా.. ఐదవ దశ (800 మెగావాట్లు) నిర్మాణ ప్రాంతంలో లిఫ్ట్ కేబుల్ వైరు తెగిపోవడంతో ముగ్గురు కార్మికుల అక్కడికక్కడే మృతి చెందారు.. లిఫ్ట్ లో చిక్కుకున్న నలుగురు కార్మికులను కాపాడే ప్రయత్నాలు సాగుతున్నాయి.. మృతదేహాలను వీటీపీఎస్‌ బోర్డు ఆసుపత్రికి తరలించారు.. మృతులు జార్ఖండ్ కు చెందిన కాంట్రాక్టు కార్మికులుగా గుర్తించారు అధికారులు.. మృతులు చోటు సింగ్, జితేంద్ర సింగ్‌గా చెబుతున్నారు.

Read Also: Bhatti Vikramarka: కొనసాగుతున్న భట్టి విక్రమార్క పాదయాత్ర.. ఆదివాసీల సమస్యలపై..

Exit mobile version