NTV Telugu Site icon

మా ఆవేదనను సజ్జలకు స్పష్టంగా చెప్పాం : బొప్పరాజు

bopparaju venkateshwarlu

11వ పీఆర్‌సీపై ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు గత కొన్ని రోజుల నుంచి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్న ఏపీ సీఎస్‌ సమీర్‌శర్మ పీఆర్‌సీపై నివేదికను సీఎం జగన్‌ మెహన్‌రెడ్డి అందజేశారు. మూడు రోజుల్లో సీఎం జగన్‌ పీఆర్‌సీపై స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. మా అభిప్రాయాలను, ఆవేదనను సజ్జలకు స్పష్టంగా చెప్పామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఉద్యోగులకు వ్యతిరేకంగా ఇచ్చిన సీఎస్ కమిటీ సిఫార్సులను వ్యతిరేకిస్తున్నామన్నారు.

కనీసం నివేదిక అంశాలను మాతో సీఎస్ కమిటీ చర్చించలేదని, 14.29 శాతం ఫిట్ మెంట్ గా చెప్పడాన్ని జేఏసీలు వ్యతిరేకించాయని తెలిపారు. ఫిట్ మెంట్, మానిటరీ బెన్ ఫిట్ అమలు, లబ్దిపై తేడాలున్నాయని, సీఎంతో చర్చల్లో మేము దీనిపై స్పష్టత తీసుకుంటామన్నారు. 14.29ఫిట్ మెంట్ తో 13లక్షల మంది ఉద్యోగులు నష్టపోతారని, హామీల అమలుపై అగ్రిమెంట్ రూపంలో ఇస్తే తప్పకుండా ఉద్యమంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఐఆర్ కంటే అదనంగా ఫిట్ మెంట్ ఇచ్చే సాంప్రదాయాన్ని కొనసాగించాలని కోరామన్నారు. సచివాలయ సంఘం ఒప్పుకున్నట్లుగా 34 శాతం ఫిట్ మెంట్ కు మేము ఒప్పుకోమన్నారు.