NTV Telugu Site icon

Mohan Babu Issue: స్థలం గొడవ.. మోహన్‌బాబు అనుచరులు హత్యకు కుట్రపన్నారన్న ఎంపీటీసీ

Mohan Babu Land Issue

Mohan Babu Land Issue

Land Issue Between Mohan Babu Vidyaniketan University And Rangampeta Villagers: చిత్తూరు జిల్లా రంగంపేట గ్రామస్థులు, నటుడు మోహన్ బాబు మధ్య స్థలం విషయమై వివాదం ముదురుతోంది. ఎంపీటీసీ బోస్ చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ మోనీష్‌లపై మోహన్ బాబు మనుషులు దాడికి ప్రయత్నం చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. రాత్రి నుంచి రంగంపేటలో ఆరుగురు దుండగులు పెట్రోల్ క్యాన్‌లు, కత్తులు, కర్రలతో హల్‌చల్ చేస్తున్నారని గుర్తించిన గ్రామస్తులు.. హేమంత్ అనే ఓ యువకుడ్ని పట్టుకొని చితకబాదారు. అనంతరం అతడ్ని పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ బోస్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. విద్యానికేతన్ సంస్థల డంపింగ్ యార్డ్ స్థలం కోసం మోహన్ బాబు ప్రయత్నిస్తున్నారని.. అయితే గ్రామ సభలో తీర్మానం చేశాకే ఆ భూములు ఇస్తామని చెప్పామన్నారు. గ్రామానికి సంబంధించిన భూములు కావడంతో.. ఆ స్థలం ఇవ్వకూడదని గ్రామస్తులు తీర్మానం చేశారన్నారు.

Ice Cream: కాటేదాన్‌లో కల్తీ ఐస్ క్రీమ్.. సైబరాబాద్ ఎస్ఓటీ అదుపులో నకిలీ ముఠా

నాగపట్నం సర్వే నెంబర్ 10/2లో 35 సెంట్లు భూమిపై మోహన్ బాబు యూనివర్సిటీ నిర్వాహకులు కన్నేశారని బోస్ చంద్రారెడ్డి పేర్కొన్ననారు. 2023 ఫిబ్రవరిలో తాము సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరామని.. గుణశేఖర్ రెడ్డి పేరుతో వివరాలు సేకరించామని తెలిపారు. అప్పటి నుంచి తమపై కక్ష పెంచుకున్నారని అన్నారు. గతంలోనే తమపై ఓసారి దాడికి ప్రయత్నించారని.. అప్పుడే తాము ఫిర్యాదు చేయాలని అనుకున్నామని.. కానీ పెద్దమనుషులు ఓపిక పట్టమని చెప్పడంతో వెనక్కి తగ్గామని తెలిపారు. ఆ స్థలంలో ఏవో పనులు జరుగుతున్నాయని అనుమానం రావడంతో.. మరోసారి తాము గుణశేఖర్ రెడ్డి పేరుతో అదే సర్వే నంబర్‌పై సమాచార హక్కు చట్టం కింద వివరాలకు దరఖాస్తు చేశామన్నారు. దాంతో.. ఆ భూములు తమకు దక్కకుండా అడ్డుకుంటున్నారన్న ఉద్దేశంతో, తమపై దాడికి ప్రయత్నిస్తున్నారని ఆయన వెల్లడించారు.

Rashmika Mandanna: దారుణంగా మోసపోయిన రష్మిక.. క్షణాల్లో సంచలన నిర్ణయం!

హేమంత్ అనే ఒక వ్యక్తి మాస్క్ ధరించుకొని.. తమ ఇంటికొచ్చి కత్తి తీసి బెదిరించాడని బోస్ చంద్రారెడ్డి తెలిపారు. అయితే.. అపార్ట్‌మెంట్‌లో ఉన్న జనాభాను చూసి వెనక్కి వెళ్లిపోయాడన్నారు. అతనితో వచ్చిన కొంతమంది కారు దగ్గర కర్రలు పెట్టుకుని ఉన్నారని, అనుమానంతో తాను పైకి వెళ్లానని చెప్పారు. సునీల్ చక్రవర్తి అనే వ్యక్తి తన కారుని కాల్చేయమని చెప్పాడని.. మోహన్ బాబు యూనివర్సిటీ పిఆర్వో సతీష్ తమ ఫోటోలతో పాటు కారు ఫోటోలు పంపించమని కోరుతూ, మూడు వేల రూపాయలు అతనికి ఫోన్ పే కూడా చేశాడని పేర్కొన్నారు. తమ ఇంటిపై పెట్రోల్‌తో దాడికి ప్రయత్నించాని ఆరోపణలు చేశారు. తమకు మోహన్ బాబు, పీఆర్వో సతీష్, సునీల్ చక్రవర్తి వల్ల ప్రాణహాని ఉందని.. పోలీసులు తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.