Site icon NTV Telugu

Lakshmi Parvathi: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి.. టీడీపీని స్వాధీనం చేసుకోవాలి

Lakshmi Parvathi

Lakshmi Parvathi

Lakshmi Parvathi: తెలుగు, సంస్కృతి అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడంపై ఆమె స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని లక్ష్మీపార్వతి ఆకాంక్షించారు. అంతేకాకుండా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తెలుగు దేశం పార్టీని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అదే తన కోరిక అని చెప్పారు. చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరించి మహానేత ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నారని ఆమె ఆరోపించారు. అటు స్వర్గీయ గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు జయంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు లక్ష్మీపార్వతి తెలిపారు. ఈనెల 25న తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ వేదికగా గిడుగు బాషా ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. గిడుగు బాషా ఉత్సవాల సందర్భంగా రేపు ఆరుగురిని పురస్కార గ్రహీతలుగా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు.

Read Also: Balineni Srinivasa Reddy : ఆ మాజీ మంత్రికి అన్నీ వివాదాలేనా..! కంటిపై కునుకులేకుండా పోయిందా..?

అటు చంద్రబాబు హయాంలో విద్యాశాఖను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని లక్ష్మీపార్వతి ఆరోపించారు. గత ప్రభుత్వం హయాంలో 30 వేల స్కూల్స్ మూత పడ్డాయన్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు కు శ్రీకారం చుట్టిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. విమర్శలు చేస్తున్న వారు, తెలుగు భాషా అభివృద్ధికి కృషి చేస్తున్నామంటున్న వారు వాళ్ళ పిల్లలను ఆంగ్ల భాషలో చదివించడం లేదా అని ప్రశ్నించారు. పేద పిల్లలకు ఆంగ్లభాషను అందుటులోకి తీసుకువచ్చిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. తెలుగుకు సీఎం జగన్ ద్రోహం చేశారని కొందరు అవాస్తవాలు మాట్లాడతున్నారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో తెలుగు స్కూల్స్‌ను పెద్ద సంఖ్యలో మూసివేశారన్నారు. తెలుగు మరియు సంస్కృత అకాడమీకి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుపతి గోశాల వద్ద స్థలం కేటాయించారని తెలిపారు.

Exit mobile version