ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వై విద్యాసాగర్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదైంది… తిరుపతికి చెందిన వై. విద్యాసాగర్‌పై కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు.. కమలానగర్‌కు చెందిన హైకోర్టు న్యాయవాది సుంకర నరేష్ నుంచి రూ. 20 వేలు తీసుకున్న ఆయన… తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం టికెట్లు ఏర్పాటు చేస్తానని నమ్మించారని.. ఇందుకోసం రూ. 20 వేలు గూగుల్ పే ద్వారా ట్రాన్స్ పర్ చేసిన తర్వాత.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయానని గ్రహించిన నరేష్.. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు.. ఇక, నరేష్ ఫిర్యాదుతో విద్యాసాగర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.. విద్యాసాగర్‌పై ప్రాథమిక విచారణ చేసిన పోలీసులు.. నిందుతుడి మీద ఈ విధంగానే కొన్ని ఆన్ లైన్ ఫిర్యాదులు ఉన్నాయని.. దీంతో, ఐపీసీ 420 కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.. మొత్తంగా టీడీపీ నేతపై రూ.20 వేల విషయంలో కేసు నమోదు అయ్యింది.
Read Also: Jana Reddy : శంకుస్థాపనలతోనే గొప్పలు.. పనులు మాత్రం నిల్…!