PM Modi AP Tour: రేపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించారు. ఈ నేపథ్యంలో సిద్ధం చేసిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. నన్నూరు వద్ద 49.37 ఎకరాల్లో 3 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేయగా, 18.30 ఎకరాల్లో 3 హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. ఇక, వీవీఐపీ పార్కింగ్ కోసం 17 ఎకరాలు, వీఐపీ పార్కింగ్ కోసం 33 ఎకరాల్లో ఏర్పాట్లు చేపట్టారు. అలాగే, పబ్లిక్ వాహనాల పార్కింగ్ కోసం 342 ఎకరాలను కేటాయించారు. 11 ప్రదేశాల్లో పార్కింగ్ ను ఏర్పాటు చేయగా, పబ్లిక్ మీటింగ్ తో పాటు పార్కింగ్, హెలిప్యాడ్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
Read Also: IND vs AUS: కోహ్లీ మిస్టర్ పర్‌పెక్ట్.. 3 మ్యాచ్‌లలో 2 సెంచరీలు చేస్తాడు!
అయితే, 11 పార్కింగ్ ప్రాంతాల్లో పార్కింగ్స్, 2 బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సులు, మెడికల్ క్యాంప్ లను ఏర్పాటు చేశారు. బహిరంగ సభ ప్రదేశంలో వీఐపీల కోసం రెండు 10 పడకల ఆసుపత్రులు, ప్రజల కోసం 20 పడకల ఆసుపత్రిని సైతం సిద్ధం చేశారు. ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లలో 8 మంది మంత్రులు, 35 మంది ఐఏఎస్ అధికారులు, 37 మంది ఐపీఎస్ అధికారులు, 200 మంది రాష్ట్ర స్థాయి అధికారులు, 19 డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు.
Read Also: Insurance Fraud Murder: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వృద్ధుడి హత్య.. ముక్కలు ముక్కలుగా నరికి!
అలాగే, ఎల్లుండి ఉదయం 11.15 గంటలకు శ్రీశైల ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా రూ. 13, 430 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేయనుండగా.. రూ. 2,880 కోట్ల విలువైన ట్రాన్స్ మిషన్ వ్యవస్థకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారు. మరోవైపు, ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో శ్రీశైలం రహదారిపై రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఈ నెల 16న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలం రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. హైదరాబాద్- శ్రీశైలం, దోర్నాల- శ్రీశైలం రహదారి మార్గాల్లో వాహన రాకపోకలను తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు తేల్చి చెప్పారు.
