NTV Telugu Site icon

కర్నూలు జిల్లాలో విషాదం… సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా నంద్యాలలోని ప్రియాంకనగర్‌లో విషాదం నెలకొంది. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఒకరు మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో స్థానికులు వారిని వెంటనే ఆస్ప్రత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి వైఎస్ఆర్ నగర్‌కు చెందిన గోవింద్‌గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: ఇలానే కొన‌సాగితే… వాటికి ముప్పు త‌ప్ప‌దా…?