Kurnool Bus Tragedy: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. బస్సు ఇంధన ట్యాంకర్‌ను బైక్ ఢీకొట్టడం వల్ల ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Jubilee Hills Bypoll : ముగిసిన నామినేషన్స్ విత్‌డ్రా.. బరిలో ఎంతమందంటే.?
ఈ ఘటన చాలా దురదృష్టకర సంఘటనని.. మృతుల్లో 17 మంది పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీస్, ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారని ఆమె వివరించారు. మంటలు చెలరేగగానే అప్రమత్తమై 27 మంది ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకోగలిగారని, ప్రస్తుతం 9 మంది చికిత్స పొందుతున్నారని మంత్రి తెలిపారు. మృతుల్లో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు ఉన్నట్లు చెప్పారు. ప్రమాదం ఎలా జరిగిందో తేల్చేందుకు అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, నాలుగు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని హోం మంత్రి అనిత తెలిపారు. ఈ ప్రమాదంపై ఎంక్వైరీ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇకపోతే, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మృతులకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ఆమె ప్రకటించారు.
Kurnool Bus Incident: కర్నూలు బస్సు ప్రమాదంపై బాపట్ల ఎంపీ కీలక వ్యాఖ్యలు.. కారణం అదే..!
మరోవైపు, మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తైంది. మృతదేహాలు పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో, మృతుల బంధువుల నుంచి డీఎన్‌ఏ శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ బృందం సేకరించింది. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా మృతులను గుర్తించి, వీలైనంత త్వరగా వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నామని హోం మంత్రి తెలిపారు.
