Srisailam: శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, ఈవో శ్రీనివాసరావు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు. బోర్డ్ మీటింగ్ లో 14 అంశాలు ప్రవేశ పెట్టగా 11 ఆమోదం పొండగా మరో 2 వాయిదా పడ్డాయి, ఇంకొక్కటి తిరస్కరించారు. ఇక, స్థానిక చెంచు గిరిజనులకు ప్రతి నెల ఒక రోజు శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తితో కొలను భారతి ఆలయాన్ని దత్తత తీసుకునేందుకు ఆమోదం తెలిపారు.
Read Also: 200MP Camera Phones: 200MP కెమెరా స్మార్ట్‌ఫోన్‌ల జాబితా.. 23 వేల నుంచే ఆరంభం!
అలాగే, 500 రూపాయల స్పర్శ దర్శనం పొందిన భక్తుడికి 100 గ్రాముల 2 లడ్డులు అందజేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ. 300 టికెట్ పొందిన భక్తుడికి 100 గ్రాముల ఒక లడ్డు ఇచ్చేందుకు ఆమోదం తెలపగా డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. ఇక, ప్రధాన ఆలయంలోని గోక్కులాన్ని దాతల సహకారంతో ఆధునీకరణకు ఆమోదం తెలిపారు. శివ సేవకులతో క్షేత్ర పరిధిలో పలు చోట్ల హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసేందుకు ఆలయ కమిటీ ఆమోదించింది.
