Site icon NTV Telugu

YS Jagan: పతనమైన ఉల్లి, టమాటా ధరలు.. చంద్రబాబు సర్కార్పై జగన్ ఫైర్!

Jagan Ys

Jagan Ys

YS Jagan: ఏపీలో ఉల్లి, టమోటా రైతుల దీన స్థితిపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను పట్టించుకోని చంద్రబాబు సర్కార్ పై మండిపడ్డారు. ఉల్లి, టమోటా రైతుల వీడియోలతో ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబూ పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు అని ఎద్దేవా చేశారు. కర్నూలులో కిలో ఉల్లి 3 రూపాయలేనా?, రూపాయిన్నరకే కిలో టమోటానా? ఇవేం ధరలు? అని ప్రశ్నించారు. ఇంతకీ రైతు అనేవాడు బతకొద్దా?.. గత కొన్ని వారాలుగా రైతులు లబోదిబోమంటున్నా మీరు కనికరం కూడా చూపడంలేదు కదా? అని వైఎస్ జగన్ అడిగారు.

Read Also: Online Game: ఆన్‌లైన్ గేమ్‌లో రూ.13 లక్షలు పోగొట్టిన 6వ తరగతి విద్యార్థి.. కట్‌చేస్తే..

ఇక, ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిరక్ష్యం చూపుతారా? అని మాజీ సీఎం జగన్ అన్నారు. ఈ ప్రభుత్వం ఉండికూడా ఏం లాభం?.. ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్టేకదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటా ఉల్లిని రూ.1200కు కొనుగోలు చేస్తామంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు.. కానీ, తూతూమంత్రంగా చేసి, అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారు.. ఎవ్వరూ కొనడంలేదు, ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది? అని అడిగారు. ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఇతరత్రా స్టోర్ లో ఆన్లైన్ లో నెట్లోకి వెళ్లి చూస్తే కిలో రూ.29 నుంచి రూ.32కు ఎలా అమ్ముతున్నారు? అని జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.

Read Also: Uttar pradesh: నెట్టింట్లో బీజేపీ జిల్లా ఉపాధ్యాక్షుడి అసభ్యకర వీడియో..

అయితే, రైతు బజార్లో కూడా కిలో రూ.25లకు తక్కువ అమ్మడం లేదు కదా? అని మాజీ ముఖ్యమంత్రి జగన్ అడిగారు. మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదు?.. ఇది మీ తప్పు కాదా చంద్రబాబూ? అన్నారు. ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టి పెట్టకపోడం బాధాకరం అని చెప్పుకొచ్చారు. అటు టమాటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదు.. కొనేవారు లేక పంటలను రోడ్డుమీదే పారబోస్తున్నారు.. చంద్రబాబు తక్షణం రైతుల పంటలను కొనుగోలుచేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపండి అని వైఎస్ జగన్ కోరారు.

Exit mobile version