Site icon NTV Telugu

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం ఘటనలో ఆసక్తికర విషయాలు.. వీటి వల్లే మంటలు..!

Kurnool Bus Accident

Kurnool Bus Accident

Kurnool Bus Accident: 19 మంది సజీవ దహనం అయిన కర్నూలు బస్సు ప్రమాదం కేసులో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.. ప్రమాద తీవ్రత పెంచడంలో బైక్‌లో పెట్రోలు, బస్సులోని డీజిల్‌తో పాటు.. లగేజీ కేబిన్‌లో ఉన్న సెల్ ఫోన్ల పాత్ర కీలకంగా భావిస్తున్నారు.. బైక్ ను ఢీకొన్న బస్సు.. బంపర్‌లో చిక్కుకుపోయిన బైక్‌ను 300 మీటర్ల వరకు ఈడ్చుకు పోవడంతో బైక్ పెట్రోల్ ట్యాంక్ మూత ఊడిపోయి బస్సు కింద రోడ్డు పొడవునా పెట్రోల్ పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు కింద చివరి వరకు ఒకేసారి మంటలు వ్యాపించాయి.. ఇక, ఆ మంటలతో లగేజీ కేబిన్‌లోని సెల్ ఫోన్స్‌ బ్యాటరీలు పేలినట్టు అంచనా వేస్తున్నారు. అయితే, బ్యాటరీ పేలుళ్ల తీవ్రతకు బస్సులోపలి భాగంలోని ప్లాట్ ఫామ్ పూర్తిగా కాలిపోయింది.. దీంతో క్షణాల్లో బస్సులోపలికి మంటలు వ్యాపించాయి.. సుమారు 3 వేల డిగ్రీల ఉషోగ్రతలో కాలిపోయి మాంసపు ముద్దాలుగా మారిపోయారు ప్రయాణికులు.. దీంతో ప్రమాద తీవ్రత పెరిగి 15 నిముషాల్లో మొత్తం కాలిపోయింది బస్సు..

Read Also: Hyderabad ORR Tragedy: హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై మరో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా..

మరోవైపు.. బస్సు దగ్ధం ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. బస్సు దగ్ధం కాక ముందు బైక్ ను ఢీకొన్న సమయంలో బైకర్ శివశంకర్ తోపాటు మిత్రుడు ఎర్రిస్వామి కూడా ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు.. ఎర్రిస్వామి స్వగ్రామం తుగ్గలి మండలం రాంపల్లి కాగా.. ఇద్దరూ కలిసి మద్యం సేవించి ఆ తరువాత పెట్రోల్ బంక్ కి వెళ్లినట్టు సమాచారం.. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ వేయించుకుని వెళ్లిన తరువాతే బస్సు దగ్ధం ఘటన చోటు చేసుకుంది.. దీంతో, ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అసలు ఏం జరిగింది అనే కోణంలో ఆరా తీస్తున్నారు..

Exit mobile version