AP Onion Market: కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు చేసిన రైతులకు కన్నీళ్ళు పెట్టిస్తోంది. ఒకవైపు అధిక వర్షాలు, ఉల్లి ధర లేకపోవడం, ఉన్న ధరకూ కొనేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో రైతు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చేసిన కష్టం మార్కెట్ లో కళ్ళ ముందే కుళ్ళిపోతుంటే రోడ్డెక్కి కడుపు చించుకున్నా బాధ తీరడం లేదు.. ప్రభుత్వం క్వింటాల్ ఉల్లి రూ. 1200 చొప్పున కొనుగోలు చేస్తామని ప్రకటించినా నాలుగు రోజులకే కొనుగోలు ఆపేశారు. ఇపుడు రైతులకు కనీస ధర రూ. 1200 ఇస్తామని, వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే ఇస్తుందని చెబుతున్నారు. ఉల్లి రైతు గోడు ఎవరికీ పట్టదా.. ఉల్లి సాగు చేసిన రైతు ఎప్పుడూ నష్టపోవాల్సిందేనా..
Read Also: Hyderabad: హుస్సేన్ సాగర్ లో పేరకు పోయిన వ్యర్థాలు ఎంతంటే..?
అయితే, ఉల్లి కిలో రూ.25 నుంచి రూ.30 ధర పలుకుతోంది. ఇది సగటు వినియోగదారుల పరిస్థితి.. మార్కెట్ యార్డులో క్వింటాలు ఉల్లి రూ. 500, రూ. 600 మాత్రమే ఉంది. సరుకు బాగా లేకుంటే క్వింటాలు ఉల్లి రూ. 200 మాత్రమే.. అంటే కిలో ఉల్లి రెండు రూపాయలు నుంచి ఆరు రూపాయలన్న మాట. ఏదో ఒక లాట్ ఉల్లి రూ.1200, 1300 ధర పలుకుతోంది. ఇది కర్నూలు ఉల్లి మార్కెట్ లో రైతు పరిస్థితి.. మూడు వారాలుగా ఉల్లి ధర పడిపోయి, తక్కువ ధరకు కూడా వ్యాపారులు కొనుగోలు చేయక రైతులు ఆల్లడిపోతున్నా అధికారుల వైపు నుంచి పూర్తి స్థాయిలో పరిస్థితి చక్కదిద్దిన దాఖలాలు కనిపించడం లేదు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, మార్కెటింగ్ శాఖ జోనల్ అధికారి, పలువురు రాజకీయ నాయకులు, ప్రజాసంఘాలు.. ఇలా అనేక మంది ఉల్లి ధరపైనా, రైతుల దయనీయ పరిస్థితిపైనా అక్కడికి వెళ్లి స్వయంగా తెలుసుకున్నా ఎలాంటి మార్పు కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Charlapally Drug Case: చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు.. రోజు వారి కూలీగా వెళ్లిన పోలీసు
ఇక, ఉల్లి పంట నెల క్రితం దిగుబడి ప్రారంభమై మార్కెట్ కు వస్తోంది. మహారాష్ట్ర ఉల్లిని వ్యాపారులు కర్నూలు మార్కెట్ లో తెచ్చి విక్రయిస్తుడడంతో కర్నూలు ఉల్లి ధర దారుణంగా పడిపోయింది. ఆ తరువాత వరుసగా వర్షాలు రావడంతో ఉల్లి నాణ్యత కూడా దెబ్బతినింది. కర్నూలు మార్కెట్ లో ఉల్లి కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో.. రైతులు 3, 4 రోజులుగా పడిగాపులుగాశారు. క్వింటాలు ఉల్లి 300, 500, 600 ధర కోట్ చేయడంతో తీవ్రంగా నష్టపోయారు. అయితే, ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాధారణంగా 50 వేల నుంచి 70 వేల ఎకరాలు ఉల్లి సాగవుతుంది. ఉమ్మడి జిల్లాలో కోడుమూరు, గోనెగండ్ల, ఆలూరు, ఆదోని, పత్తికొండ, దేవనకొండ, ఎమ్మిగనూరు, డోన్, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల్లో ఎక్కువగా ఉల్లి సాగు చేస్తారు. మహారాష్టలో కూడా ఉల్లి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది. ఈనేపథ్యంలో ఉల్లి దిగుబడులు మొదలైన తొలిరోజుల్లోనే కర్నూలు మార్కెట్ లో ఉల్లి ధర క్వింటాలు గరిష్టంగా రూ.13000 , కనిష్ట ధర రూ.300 ఉంది. క్వింటాలు 1300 వందలతో అమ్ముడు పోయే ఉల్లి అతి తక్కువగా ఉంటుంది. 500, 600 ధరతో కొనుగోలు చేస్తే ఎక్కువ.
Read Also: Mumbai: బీచ్ శుభ్రం చేసిన అక్షయ్ కుమార్, అమృత ఫడ్నవీస్
కాగా, ఉల్లి సాగుకు ఎకరాకు రూ.70 వేల వరకు ఖర్చవుతోంది. ఉల్లి 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చి ధర క్వింటాలుకు రూ.2 వేల పైబడి ఉంటేనే గిట్టుబాటు అవుతుంది. పంట దిగుబడి తగ్గినా, గిట్టుబాటు ధర లేకపోయినా రైతు నష్టాల పాలు కాకతప్పదు. ప్రస్తుతం ఉల్లి మార్కెట్ కు 10 వేల క్వింటాళ్లకు పైబడి మార్కెట్ వస్తుంది. ఈనెలాఖరు నాటికి మార్కెట్ కు ఉల్లి రాక పెరిగే అవకాశం ఉంది. ఇపుడే ధర పతనమైతే మార్కెట్ కు వచ్చే ఉల్లి పెరిగితే ధర పెరగకపోగా మరింత పడిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన రైతుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మహారాష్ట్ర ఉల్లి కర్నూలు మార్కెట్ కు వస్తున్న కారణంగా తమకు సరైన ధర దక్కడంలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: JK Encounter: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం!
అలాగే, ఉల్లి ధరపై రైతుల ఆందోళనకు సీఎం చంద్రబాబు స్పందించారు. క్వింటాలు 1200 చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. సీఎం ఆదేశించినా నాలుగు రోజుల తరువతగానీ అధికారులు స్పందించలేదు. నాలుగు రోజులపాటు క్వింటాలు 1200 చొప్పున మార్క్ ఫెడ్ ద్వారా ఉల్లి కొనుగోలు చేసిన ప్రభుత్వం ఆ తరువాత నిలిపివేసింది. కొనుగోలు చేసిన ఉల్లి నిల్వలు గోడౌన్ లలో పేరుకుపోవడంతో స్థలం లేదని, కొనుగోలు చేయలేమని మార్క్ అధికారులు చేతులెత్తేశారు. దీంతో ఉల్లి రవాణా చేసిన వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో ఉల్లి క్వింటాలు కనీస ధర 1200 దక్కేలా చేస్తామని, 1200 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తే మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2019 లో ఇలాగే అప్పటి ప్రభుత్వం ప్రకటించినా ఆ తరువాత అధికారంలోకి రాకపోవడంతో చాలా మంది రైతులకు ఆ మొత్తం అందలేదు. దీంతో రైతుల్లో అపనమ్మకం ఏర్పడింది. కానీ, కర్నూలులో రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. వైసీపీ, సీపీఎం మద్దతు ప్రకటించి ఆందోళనలో పాల్గొన్నారు. ఇవాళ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతులతో ముఖాముఖి మాట్లాడనుంది. ఉల్లి, టమాటా ధరలపై ప్రభుత్వాలు శాశ్విత పరిష్కారానికి చర్యలు తీసుకోలేదన్నది అక్షరసత్యం.. దశాబ్దాలుగా ఉల్లి, టమాటా రైతుల పరిస్థితి దయనీయంగానే ఉంది.
