కర్నూలు జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో తరచూ ఇలాంటివి జరగడంతో భయాందోళనలు నెలకొన్నాయి. పత్తికొండ మండలం పందికోన ఫారెస్ట్ లో క్షుద్రపూజలు జరిగాయి.
మట్టితో తయారు చేసిన బొమ్మలు, నిమ్మకాయలు, కోడిగుడ్లతో భారీ ఎత్తున క్షుద్రపూజలు జరిగాయని తెలుస్తోంది. క్షుద్రపూజలు చేసిన ప్రదేశాన్ని చూసిన గొర్రెల కాపరులు. అటువైపు వెళ్లాలంటే భయపడుతున్నారు. గొర్రెల కాపరులు ఫారెస్ట్ లో క్షుద్రపూజలపై భయాందోళనలకు గురవుతున్నారు. ఇలాంటి తాంత్రిక పూజల పై విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.