Site icon NTV Telugu

Breaking: మూడేళ్ళ చిన్నారి గొంతు కోసి చంపిన కన్న తండ్రి

Karnool

Karnool

నేటి సమాజంలో మానవత్వం మంటగలిసిపోతుంది. రోజు రోజుకు పెరిగిపోతున్న ఆలోచన ధోరణి వల్ల మనిషి అనే వాడు ఓ వింత జంతువుగా మారిపోతున్నాడు. అయితే, పెంచి, పోషించి, తన పిల్లలను ప్రయోజకులుగా తీర్చి దిద్దాల్సిన తండ్రే ఆ పిల్లల ఎదుట కాల యముడిగా మారిపోతున్నాడు. తాజాగా కర్నూలు జిల్లా కోసిగి మండడలంలో ఇలాంటి దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది.

Read Also: Jr.NTR: వార్ 2 కోసం ముంబైకి వెళ్లనున్న ఎన్టీఆర్..

వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లాలోని కోసిగి మండలం జంపాపురంలో దారుణం చోటు చేసుకుంది. తన మూడేళ్ళ చిన్నారిని ఓ కసాయి తండ్రి శాంతి కుమార్
గొంతు కోసి చంపేశాడు. ఇవాళ తెల్లవారు జామున తల్లి పక్కన నిద్రిస్తున్న సమయంలో కత్తితో గొంతు కోసి ఆ పాసికూనను హతమార్చాడు. అయితే, భార్య సంపూర్ణ ఇంటికి ఇల్లరికం వెళ్లిన శాంతికుమార్.. సొంత ఊరు మంత్రాలయం మండలం కగ్గళ్ళు గ్రామం.. గత కొద్ది రోజులుగా మద్యానికి బానిసైన శాంతికుమార్.. కొంత కాలంగా సైకోగా ప్రవర్తిస్తూ భార్యను కొడుతున్న చిత్ర హింసలకు శాంతికుమార్ గురి చేశాడు. తాజాగా తన మూడేళ్ల చిన్నారిని చంపడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక, సంఘటన ప్రదేశానికి వచ్చిన పోలీసులు సైకోను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version