Organ Donation: కొందరు బ్రతికుండగా కొందరి ప్రాణాలు కాపాడతారు.. ఇంకా కొందరు చనిపోయినా కూడా ప్రాణాలు కాపాడుతూనే ఉన్నారు.. వారివళ్ల ఇప్పటికే చాలా మందికి కంటిచూపు.. గుండె, కిడ్నీలు, లివర్.. ఇలా ఎంతో మందికి అమర్చారు వైద్యులు.. తాజాగా, కర్నూలు జిల్లాలో 59 ఏళ్ల వయస్సులో కన్నుమూసిన పెద్దయ్య అనే వ్యక్తి.. చనిపోతూ.. మరో ముగ్గురికి ప్రాణదానం చేశారు..
Read Also: JK: జమ్మూకాశ్మీర్ లోయలో పడ్డ ఆర్మీ ట్రక్కు.. ఇద్దరు జవాన్లు మృతి
కర్నూలు జిల్లా కల్లూరు మండలం దొడ్డిపాడుకి చెందిన పెద్దయ్య (59) మొదడులో నరాలు చిట్లి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్ కు తరలించగా బ్రెయిన్ డెడ్ అయి అచేతనావస్థలోకి వెళ్లారు. పెద్దయ్య కుటుంబ సభ్యులతో ఏపీ జీవన్ దాన్, సమన్వయకర్త, కుటుంబ సభ్యులకు, బంధువులకు అవగాహన కల్పించడంతో అవయవదానానికి అంగీకరించారు. లివర్, రెండు కిడ్నీలు దానం చేశారు. తండ్రి చనిపోతూ కూడా మరో ముగ్గురికి ప్రాణదానం చేయడం తమకు గర్వంగా ఉందన్నారు పెద్దయ్య కుటుంబ సభ్యులు.. కాగా, అవయదానంపై కొందరిలో అవగాహన వచ్చినా.. చాలా మందిని ఇంకా మూడ నమ్మకాలు వెంటాడుతూనే ఉన్నాయి.. ప్రజల్లో మరింత చైతన్యం వచ్చి.. అవయవదానం చేస్తే.. మరింతమందిని బతికించవచ్చు