Site icon NTV Telugu

Kurnool Court: వైసీపీ మాజీ ఎమ్మెల్యే భర్త హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు..

Cherukulapadu Narayana Redd

Cherukulapadu Narayana Redd

Kurnool Court: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి భర్త చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించింది కర్నూలు జిల్లా కోర్టు.. ఈ కేసులో నిందితులగా ఉన్న 11 మందికి జీవిత ఖైదు విధించింది.. ఈ మేరకు జిల్లా జడ్జి కబర్ది తీర్పు చెప్పారు. 2017 మే 21న వివాహానికి వెళ్లి వస్తుండగా కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం శివారులో నారాయణరెడ్డి వాహనాన్ని అడ్డగించి నరికి హత్య చేశారు. ఈ హత్య కేసులో మొత్తం 19 మంది నిందితులు కాగా ఒకరు మృతి చెందారు. ఇద్దరిని కేసు నుంచి తొలగించారు. ఇక, 11 మంది నిందితులకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.వెయ్యి జరిమానా విధించింది కోర్టు.. రామాంజనేయులు, రామానాయుడు, రామకృష్ణ, బాలు, చిన్న ఎల్లప్ప, పెద్ద ఎల్లప్ప, వెంకట్రాముడు, గంటల శ్రీను, నారాయణ, బీసన్న గారి రామాంజనేయులు, పెద్ద బీసన్న కు జీవిత ఖైదు శిక్షపడిన వారిలో ఉన్నారు.

Read Also: Operation Sindoor: “ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు”: రాజ్‌నాథ్ సింగ్..

2017 మే 21న కృష్ణగిరి మండలంలో వైసీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకు గురయ్యారు.. ఈ కేసులో 29 మంది సాక్షులను విచారించింది కోర్టు.. అందులో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. మరోవైపు, ప్రస్తుత పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, దేవనకొండకు చెందిన కప్పట్రాళ్ల బుజ్జమ్మ పేర్లను గతంలోనే.. న్యాయస్థానం ఆదేశాల మేరకు తొలగించారు..

Exit mobile version