Site icon NTV Telugu

CM Chandrababu : అభివృద్ధికి కొత్త దిక్సూచి.. కుప్పంలో ఏడు పరిశ్రమలకు శంకుస్థాపన

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu : కుప్పం ప్రాంతం పరిశ్రమల హబ్‌గా మారే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక అడుగు వేశారు. వర్చువల్‌గా ఏకకాలంలో ఏడు పరిశ్రమలకు శంకుస్థాపన చేసి కుప్పం అభివృద్ధి పథాన్ని మరింత వేగవంతం చేశారు. హిందాల్కో, శ్రీజా డైరీ, ఏస్ ఇంటర్నేషనల్, SVF సోయా, మదర్ డైరీ, E-Royce EV, ALEAP మహిళా పార్కులు.. ఈ సంస్థల ద్వారా మొత్తం రూ. 2,203 కోట్ల పెట్టుబడులు కుప్పంలోకి రానున్నాయి. ఈ పరిశ్రమల కోసం ప్రభుత్వం 241 ఎకరాల భూమిని కేటాయించింది.

CM Chandrababu : 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. నోటీసులకు ఆదేశం

శంకుస్థాపన అనంతరం సీఎం చంద్రబాబు కుప్పం స్థానిక రైతులు, పాడి రైతులు, మహిళలు, యువతతో ముఖాముఖి జరిపారు. అభివృద్ధి పట్ల ప్రజలు వ్యక్తం చేసిన ఆనందం, కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హంద్రీ-నీవా కాల్వ ద్వారా నీటిసౌకర్యం అందడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. కుప్పంకు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, పాలు కొనుగోలు చేసే సంస్థలు రావడం వల్ల తమ పంటలు, పాల ఉత్పత్తులను ఇక్కడి పరిశ్రమలకే నేరుగా విక్రయించే అవకాశం వస్తుందని రైతులు తెలిపారు. పరిశ్రమలు ఇంత పెద్ద సంఖ్యలో కుప్పానికి వస్తాయని కలలో కూడా అనుకోలేదని మహిళా పాడి రైతులు హర్షం వ్యక్తంచేశారు.

తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధిపొందుతున్నామని మహిళలు తెలిపారు. గతంలో ఉపాధి కోసం బెంగళూరుకు వలస వెళ్లాల్సి వచ్చేదని, ఇక పరిశ్రమలు స్థాపించడంతో కుప్పంలోనే ఉపాధి దొరకనున్నందుకు ఆనందంగా ఉందని స్థానికులు పేర్కొన్నారు. తమ ప్రాంతంలో వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించే పరిశ్రమలను తీసుకొచ్చినందుకు సీఎం చంద్రబాబుకు కుప్పం వాసులు ధన్యవాదాలు తెలిపారు. కుప్పాన్ని పరిశ్రమల కేంద్రంగా రూపుదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ప్రభుత్వం, ఈ ఏడాది పెట్టుబడులతో ప్రతి ఇంటికీ ఉపాధిని చేరవేసే దిశగా పునాది వేసిందని అధికారులు పేర్కొన్నారు.

Komatireddy Venakt Reddy : తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరగని స్థాయిలో రోడ్ల నిర్మాణం

Exit mobile version