Site icon NTV Telugu

రాయలసీమ ఎత్తిపోతల పనులపై కేఆర్ఎంబీ సీరియస్ !

KRMB AP

KRMB AP

రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు ధృవీకరించింది కేఆర్ఎంబీ. రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఎన్జీటీకి నివేదిక సమర్పించిన కేఆర్ఎంబీ.. డీపీఆర్ కు అవసరమైన పనులకన్నా అధికంగా పనులు జరిగినట్లు నివేదికలో నిర్ధారించింది. ఎన్జీటీ తీర్పును ధిక్కరించినట్లు ధృవీకరించిన కేఆర్ఎంబీ.. పంప్ హౌస్, అప్రోచ్ ఛానల్, ఫోర్ బే, డెలివరీ మెయిన్ ఛానల్, డెలివరీ సిస్టమ్, లింక్ కెనాల్ పనులు జరిగినట్లు నిర్థారించింది. రెండ్రోజులపాటు ప్రాజెక్ట్ పనులను తనిఖీ చేసిన కేఆర్ఎంబీ అధికారులు… ప్రాజెక్టులో ముఖ్యమైన పనులను పూర్తి చేసినట్లు పేర్కొంది. ఫోటోలతో సహా సమగ్ర నివేదికను ఎన్జీటీకి సమర్పించింది కేఆర్ఎంబీ. అయితే.. ఈ నివేదికపై సోమవారం విచారణ జరపనుంది ఎన్జీటీ. కోర్టు తీర్పు ధిక్కరణకు పాల్పడితే సీఎస్‌ను జైలుకు పంపుతామని గతంలో ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Exit mobile version