Site icon NTV Telugu

Water Samples: కృష్ణాజిల్లాలో డిప్యూటీ సీఎం ఆదేశాలతో 44 గ్రామాల్లో నీటి శాంపిల్స్ సేకరణ

Water

Water

Water Samples: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని 44 గ్రామాల్లో గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు నీటి శాంపిల్స్ సేకరిస్తున్నారు. గుడివాడ రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో మూడు బృందాలుగా అధికారులు శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నటరాజ్ మాట్లాడుతూ.. 44 గ్రామాల్లో త్రాగునీటి వనరుల నాణ్యతను పరిశీలిస్తున్నాం అని చెప్పుకొచ్చారు.

Read Also: India-Canada Row: ‘‘తీవ్రంగా పరిగణించాలి’’.. కెనడాకు వంతపాడిన అమెరికా..

ఇక, వాటర్ వర్క్స్ లో సేకరించిన శాంపిల్స్.. ల్యాబ్ లో పరీక్షిస్తున్నామని ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నటరాజ్ తెలిపారు. 17వ తేదీ సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో రిపోర్టులు అధికారులకు అందజేస్తాం అని చెప్పుకొచ్చారు. మూడు ఏడుళ్లుగా రిపేర్లు లేకపోవడంతో.. ఫిల్టర్ బెడ్లు పూర్తిగా పాడయ్యాయి.. ఫిల్టర్ బెడ్లు నీటిని శుద్ధి చేయలేకపోతున్నాయని చెప్పుకొచ్చారు. ఫిల్టర్ బెడ్లను మరమ్మతులు చేసేందుకు 3.30 కోట్ల రూపాయలతో అంచనాలను ఉన్నతాధికారులకు పంపామని ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నటరాజ్ వెల్లడించారు.

Exit mobile version