NTV Telugu Site icon

విజయవాడ దుర్గమ్మ హుండీ లెక్కింపు..

ఈ నెలలో దేవి శరన్నవరాత్రోత్సవాలు విజయవాడ ఇంద్రాకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో వైభవోపేతంగా జరిగాయి. తొమ్మది రోజలు అమ్మవారు వివిధ అలంకరణలలో భక్తులకు దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు దుర్గమ్మ ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు నిర్వహించారు. ఆలయ చైర్మన్‌ సోమినాయుడు, ఆలయ ఈవో భ్రమరాంబ సమక్షంలో హుండీ లెక్కింపు చేపట్టారు.

ఈ మేరకు అమ్మవారి హుండీ ఆదాయం రూ. 2.87 కోట్లు వచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా బంగారం 546 గ్రాములు రాగ, 9.55 కిలోల వెండి అమ్మవారి హుండీ ఆదాయంలో సమకూరినట్లు వెల్లడించారు. అయితే హుండీ లెక్కింపు రేపు కూడా కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.