Site icon NTV Telugu

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి అస్వస్థత..

Vamshi

Vamshi

Vallabhaneni Vamsi: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవడంతో, ఆయనను కుటుంబ సభ్యులు అత్యవసరంగా విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Read Also: Damodara Raja Narasimha : వైద్య సేవల పరంగా ప్రభుత్వం వేగంగా ముందడుగు.. అత్యాధునిక యంత్రాలు, ఫర్నీచర్ కొనుగోలు..

అయితే, వల్లభనేని వంశీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. వంశీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు వైద్యుల ప్రత్యేక బృందం నియమించబడింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ, డాక్టర్లు కొద్ది రోజుల పాటు చికిత్స కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Exit mobile version