Perni Nani: మచిలీపట్నం ప్రజలతో కొల్లు రవీంద్ర ఆటలాడుతున్నాడని వైసీపీ నేత పేర్నినాని అన్నారు. కొల్లు రవీంద్ర స్వార్ధం కోసం జనంతో ఆటలాడుతున్నారు.. 13వ తేదీన మున్సిపల్ అధికారులతో ఒక నోటీస్ ఇప్పించారు.. జూలైలోనే మున్సిపల్ అధికారులతో కొల్లు రవీంద్ర ఓ ప్లాన్ ను రెడీ చేసుకున్నారు.. బెల్లపుకోట్ల సందును నేను మొదటి సారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే విస్తరణ చేశా.. 2014లో మంత్రిగా ఉన్నప్పుడు రోడ్డు విస్తరణ చేయాలనే ఆలోచన రాలేదు.. రోడ్డు విస్తరణపై పేపర్లో వచ్చే వరకూ ఎవరికీ తెలియదు.. హడావిడిగా పేపర్ ప్రకటనపై మచిలీపట్నం ప్రజల్లో ఆందోళన మొదలైంది.. రూ. 10 కోట్లతో మిల్లు, 20 కోట్లతో కమర్షియల్ కాంప్లెక్స్, 5 కోట్లతో గెస్ట్ హౌస్ కడుతున్నాడు.. కొల్లు రవీంద్ర చేపట్టే ఒక్క నిర్మాణానికీ ప్లాన్లు లేవు.. చిన్న చిన్న వారిపై ప్రతాపం చూపించే మున్సిపల్ కమిషనర్ కు కొల్లు రవీంద్ర నిర్మాణాలు కనిపించలేదా అని మాజీ మంత్రి పేర్నినాని ప్రశ్నించారు.
Read Also: RC 17: పుష్ప 3 కన్నా ముందే చరణ్ సుక్కు సినిమా
ఇక, ప్లాన్లు లేకుండా నిర్మాణాలు జరుగుతుంటే ముడా కళ్లు మూసుకుందా అని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్నినాని ప్రశ్నించారు. మంత్రి కొల్లు రవీంద్ర అండ చూసుకుని మున్సిపల్ కమిషనర్ రెచ్చిపోతున్నాడు.. సామాన్యులు ఇల్లు కట్టుకుంటుంటే మున్సిపల్ సిబ్బంది వాలిపోతున్నారు అని ఆరోపించారు. స్థానిక టీడీపీ ఇంఛార్జ్ లకు కమిషన్ ఇస్తేనే అనుమతులు ఇస్తున్నారు.. నువ్వు మీ ఇంఛార్జిలకు ఎంత కమిషన్ ఇచ్చావ్ కొల్లు రవీంద్ర.. బడ్డీ కొట్లు కూలగొట్టించి నీ ఇంఛార్జీలకు కమిషన్లు ఇప్పించి మళ్లీ అక్కడే షాపులు పెట్టించావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లు రవీంద్ర కడుతున్న కమర్షియల్ కాంప్లెక్స్ కు కనీసం ప్లాన్ లేదు.. తన కాంప్లెక్స్ ప్లాన్ కోసం రోడ్డును విస్తరణ చేయిస్తున్నాడు.. చంద్రబాబు, లోకేష్ ఆశ్చర్యపోయే స్థాయిలో కొల్లు రవీంద్ర ఆస్తులు పోగేశాడు అని పేర్నినాని ఆరోపించారు.
