Minister Nara Lokesh: కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామికవాడలో అశోక్ లేలాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్‌ను ప్రారంభించారు మంత్రి నారా లోకేష్.. దీంతో, అమరావతిలో తొలి ఆటోమొబైల్ ప్లాంట్‌గా నిలిచింది అశోక్ లేలాండ్.. ఈ యూనిట్‌లో ఎలక్ట్రిక్, డీజిల్ బస్సుల బాడీ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటు చేసింది హిందూజా గ్రూప్.. ఈ ప్లాంట్ ఏడాదికి 2,400 బస్సుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది.. ఇక, ఈ యూనిట్ ద్వారా ఫేజ్-1లో 600 మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనుండా.. ఫేజ్-2లో 1,200 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని చెబుతున్నారు..
Read Also: Kannappa : కన్నప్ప నుంచి మహాదేవ శాస్త్రి గ్లింప్స్ రిలీజ్..
ఇక, ఈ పర్యటనలో అభయాంజనేయ స్వామి ఆలయంలో మంత్రి లోకేష్ ప్రత్యేక పూజలు చేశారు.. హనుమాన్ జంక్షన్ అభయాంజనేయస్వామి ఆలయానికి చేరుకున్న రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్‌లో అశోక్ లేలాండ్ ప్లాంట్ ను ప్రారంభించడానికి ముందు అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రి లోకేష్ కు ఆశీర్వచనాలు అందజేశారు. మంత్రి లోకేష్ ఆలయానికి వచ్చిన సమయంలో గన్నవరం నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఇక, అశోక్ లేలాండ్ యూనిట్ ప్రారంభానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి నారా లోకేష్.. ఏపీ ప్రభుత్వంపై నమ్మకంతో 90 రోజుల్లోనే యూనిట్ ను ప్రారంభించిన అశోక్ లేలాండ్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు.. మహారాష్ట్రకు ముంబై, కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ ఉంది.. మరి ఏపీకి ఏముంది అని అడిగారు.. దానికి ఒక్కటే చెప్పా.. మా బ్రాండ్ చంద్రబాబు అని చెప్పాను అని గుర్తుచేసుకున్నారు నారా లోకేష్..