NTV Telugu Site icon

Machilipatnam: తీర్పు రిజర్వ్.. పేర్ని నాని సతీమణి ముందస్తు బెయిల్‌పై ఉత్కంఠ..!

Perni Nani Family

Perni Nani Family

Machilipatnam: పేర్ని నాని భార్య కేసులో ఏ1 జయసుధ తరఫు న్యాయవాదులు తమ వాదన వినిపిస్తూ.. గోడౌన్‌లో బస్తాల షార్టేజ్ వచ్చినట్లు గుర్తించి.. నవంబర్ 27వ తేదీన ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు.. అయితే, డిసెంబర్ 3, 4 తేదీల్లో గోడౌన్లో తనిఖీలు నిర్వహించి.. 10వ తేదీన డిమాండ్ నోటీసు ఇచ్చారని కోర్టుకు వివరించారు. అనంతరం డిసెంబర్ 12వ తేదీన కేసు నమోదు చేశారని కోర్టుకు విన్నవించారు. బియ్యం తగ్గిన విషయం తామే ముందు గుర్తించి ప్రభుత్వానికి చెప్పామని తెలిపారు..

Read Also: Sonia Gandhi: మన్మోహన్‌లో ఉన్న ఆ లక్షణాలే భారతీయుల జీవితాలను మార్చేసింది

గోడౌన్‌లో బస్తాల షార్టేజ్ వచ్చినట్లు గుర్తించి.. నవంబర్ 27వ తేదీన ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. బియ్యం మాయం అయినట్లు నేరుగా వారే అంగీకరించడం.. ఆ క్రమంలో నోటీసుల జారీ చేసిన నేపథ్యంలో రూ. కోటి 70 లక్షలు ప్రభుత్వానికి చెక్కు ద్వారా చెల్లించారని కోర్టుకు గుర్తు చేశారు. నేరం చేసి.. నగదు చెల్లించామని.. దీంతో కేసు మాఫీ చేయాలంటూ కోరుతున్నట్లుగా జయసుధ తరఫు న్యాయవాదులు చెబుతున్నట్లుగా ఉందని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తమ వాదనల్లో పేర్కొన్నారు.. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు. తీర్పును రిజర్వు చేస్తున్నమని ఈ నెల 30న తీర్పు ఇస్తామని పేర్కొంది.. కాగా, ఈ కేసు వెలుగు చూసిన తర్వాత మాజీ మంత్రి పేర్నినాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విషయం విదితమే.. అప్పుడప్పుడు పేర్నినాని కనిపిస్తున్నా.. ఆ ఫ్యామిలీ మొత్తం అజ్ఞాతాన్ని వీడడం లేదు.. ఈ నేపథ్యంలో.. ఈ నెల 30వ తేదీన మచిలీపట్నం జిల్లా కోర్టు తీర్పు ఎలా రాబోతోందనే ఉత్కంఠ నెలకొంది..

Show comments