NTV Telugu Site icon

Kandula Durgesh: కూచిపూడి నృత్యం ఆవిర్భవించిన మన రాష్ట్రంలో ఆదరణ లేకపోవడం బాధాకరం..

Kuchipudi

Kuchipudi

కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడి కళాక్షేత్రంలో కూచిపూడి పతాక స్వర్ణోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, కూచిపూడి నృత్య గురువులు, కళాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలలో భాగంగా 50 అడుగుల ఏకశిలపై కూచిపూడి నృత్య భంగిమలతో పతాకాన్ని ప్రపంచానికి సమర్పించడం అద్భుతం అని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కూచిపూడి నృత్యం ఆవిర్భవించిన మన రాష్ట్రంలో ఆదరణ లేకపోవడం బాధాకరమని తెలిపారు. కూచిపూడి నృత్యం అజరామంగా విరాజిల్లే విధంగా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది.. మనది అని చెప్పుకొని సాంస్కృతిక, సాంప్రదాయ కళలు అంతరించిపోకుండా చూసుకునే బాధ్యత అందరిపై ఉందని మంత్రి దుర్గేష్ తెలిపారు.

Kakani Govardhan: కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది.. డెవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు

అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు కళల గురించి ఎప్పుడు మాట్లాడినా.. నోటి వెంట ముందుగా వచ్చేది కూచిపూడి గురించేనని అన్నారు. కూచిపూడి నృత్యాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే బాధ్యత జిల్లా వాసిగా తాను తీసుకుంటానని తెలిపారు. కూచిపూడి నృత్య కళాకారులను ప్రోత్సహించేలా.. ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి అవకాశం కల్పించేలా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని శాఖల సమన్వయంతో స్థలాలు కేటాయించి కూచిపూడి క్షేత్రాలు ఏర్పాటుతో.. భావితరాలకు కూచిపూడి నృత్యాన్ని చేరువ చేసేందుకు కృషి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

Parents Sell Baby: బైక్ కొనేందుకు.. 9 రోజుల నవజాత శిశువును అమ్మిన తల్లిదండ్రులు

రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ.. మూడు దశాబ్దాల క్రితం సిద్ధేంద్ర యోగి క్షేత్రం మీదుగా ఆవిర్భవించిన కూచిపూడి నృత్యం.. నేడు ప్రపంచవ్యాప్తంగా దశదిశలా విరాజిల్లుతుందని కొనియాడారు. భాషకు, సంస్కృతికి ప్రాధాన్యత ఇచ్చే ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.. దురదృష్టవశాత్తు మన భాషను, సంస్కృతిని, సాంప్రదాయాన్ని అంతం చేసే ప్రభుత్వమే ఐదేళ్లుగా ఉందని.. తనలాంటి వాళ్ళు ఎంతో బాధపడే వాళ్ళమని తెలిపారు. రికార్డింగ్ డాన్స్ చూసేవాళ్ళు ఎక్కువ అయిపోయారు.. కూచిపూడి చూసేవాళ్ళు తక్కువ అయిపోయారని చెప్పారు. కూచిపూడి నృత్యం గురించి ప్రపంచంలో ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు.. ఆంధ్రప్రదేశ్‌లో చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. కూచిపూడి ముఖచిత్రం మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కానీ నేడు వాటిని కాపాడే ప్రభుత్వం రావడం ఎంతో సంతోషకరమని అన్నారు. మన ఆంధ్ర సాంప్రదాయ నృత్య కళ కూచిపూడిని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడంలో.. ఎందరో మహానుభావులు తమ జీవితాలను అంకితం చేశారని తెలిపారు.

Show comments