Flood Alert: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ధాటికి కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగింది. ఇప్పటి వరకు సుమారు 6 లక్షల 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలటంతో నది పరివాహా ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. అయితే, ఇవాళ అవనిగడ్డ నియోజకవర్గంలో పులిగడ్డ ఆక్యిడిక్టెను, కే. కొత్తపాలెం వద్ధ వరద ప్రవాహాన్ని, వివిధ శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ బాలాజీ పరిశీలించారు.
Read Also: Hyderabad : హైదరాబాద్‌లో పైరసీ గ్యాంగ్ ను పట్టుకున్న సీవీ ఆనంద్
కాగా, జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే తొట్ల వల్లూరు, నాగాయలంక, మోపిదేవి మండలాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ బాలాజీ వెల్లడించారు. నది పరివాహక ప్రాంతం లోపల గ్రామాల్లోని ప్రజలనను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలియజేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.
