NTV Telugu Site icon

Collector Dance Viral: రిపబ్లిక్‌ డే సెలబ్రేషన్స్‌లో కలెక్టర్ డ్యాన్స్‌ వైరల్‌.. భార్యతో కలిసి మాస్‌ స్టెప్పులు

Collector Dance Viral

Collector Dance Viral

Collector Dance Viral: భారత 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సెలబ్రేషన్స్‌ ఘనంగా నిర్వహించారు.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. ప్రతీ ఊరు, వాడ, పల్లె, పట్నం.. ఇలా తేడా లేకుండా మువ్వన్నెల జెండా పండుగను అంగరంగ వైభవంగా సెలబ్రేట్‌ చేశారు.. ఈ సందర్భంగా సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి.. కొన్ని చోట్ల విద్యార్థులు, యువజనులు ఉత్సాహంగా ఈ ఉత్సవాల్లో పాల్గొంటే.. మరికొన్ని చోట్ల వీఐపీలు సైతం కాలు కదిపారు.. ఇక, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ కూడా డ్యాన్స్‌లు అదరగొట్టారు.. భార్యతో కలిసి సినిమా పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు కలెక్టర్ బాలాజీ.. ”గుండెల్లోన గుండెల్లోన నిన్ను దాచేసి.. గూడే కట్టి గువ్వలెక్క చూసుకుంటానే.. గుండెల్లోన గుండెల్లోన సంతకం చేసి.. పైనోడితో పర్మిషన్నే తెచ్చుకున్నానే.. ఏ గడవనే గడవదే నువ్వేలేని రోజే.. బుజ్జమ్మా బుజ్జమ్మా.. ఏ ఒడవనే ఒడవదే నీపై నాలో ప్రేమే.. బుజ్జమ్మా బుజ్జమ్మా..” అంటూ సాగే పాటకు కాలు కదిపారు..

Read Also: TSRTC Strike: ఆర్టీసీలో సమ్మె సైరన్‌.. నేడు ఎండీకి సమ్మె నోటీసులు!

అయితే, కలెక్టర్‌ బాలాజీ దంపతుల డ్యాన్స్‌ వీడియోను కొందరు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో వదలడంతో.. ఆ వీడియో కాస్తా వైరల్ గా మారిపోయింది.. మరోవైపు.. కృష్ణా కలెక్టర్‌ డీకే బాలాజీకి 2024 సంవత్సరానికి బెస్ట్‌ ఎలక్ట్రోరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డు లభించిన విషయం విదితమే.. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి ఈ మధ్యే ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతేడాది కృష్ణా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారిగా 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనపరిచినందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ బెస్ట్‌ ఎలక్ట్రోరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డుకు డీకే బాలాజీని ఎంపిక చేసిన విషయం విదితమే కాగా.. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం రోజు ఆ అవార్డును ఆయన ప్రదానం చేశారు.