Site icon NTV Telugu

Deputy CM Pawan: కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఆ నిర్ణయంతో చలించిపోయా..

Pawan

Pawan

Deputy CM Pawan: కృష్ణా జిల్లాలోని పెడన నియోజక వర్గం, పెదచందాల గ్రామంలో జనసేన క్రియాశీలక సభ్యుడు చందు వీర వెంకట వసంతరాయలు కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు ఆర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇక, మృతుడి కుటుంబ సభ్యులకు పవన్ ధైర్యం చెప్పారు. క్రియాశీలక కార్యకర్త రాయల్ కుటుంబానికి 5 లక్షల చెక్ అందించారు. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అవయవ దానం చేసిన ఘటన నన్ను ఎంతో చలించింది.. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి.. గుండె ధైర్యం చేసుకుని అవయవ దానం చేయడానికి ముందుకు రావడం గొప్ప విషయం అన్నారు.

Read Also: Teena Sravya: కుక్కకు ‘బంగారం’ తూకం.. తప్పు తెలుసుకుని హీరోయిన్ బహిరంగ క్షమాపణలు

ఇక తమ దుఃఖాన్ని దిగమింగుకొని అవయవ దానం చేసిన ఆ కుటుంబానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అని ఉప ముఖ్యమంత్రి పవన్ తెలిపారు. వసంతరాయలు కుటుంబాన్ని ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటాం.. ఆ కుటుంబానికి చెందిన ఒక అమ్మాయికి వినికిడి సమస్య ఉంది.. ఆ సమస్యను టీటీడీ శ్రవణం పథకం ద్వారా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులు నా దృష్టికి రెండు సమస్యలను తీసుకు వచ్చారు.. వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.

Exit mobile version