Site icon NTV Telugu

Farmers High Alert: గుట్టలు, గుట్టలుగా ధాన్యపు రాశులు.. ఆందోళనలో రైతులు!

Rain

Rain

Farmers High Alert: దిత్వా తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో, రైతుల్లో ఆందోళన నెలకొంది. కాగా, ఇప్పటికే కృష్ణా జిల్లాలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మండల స్థాయి అధికారులకు సైతం సూచనలు జారీ చేశారు. పండించిన ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. అలాగే, గోనె సంచులు లేని రైతులు కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇచ్చే సంచులు తక్కువగా ఉండటం, మిల్లర్లు మాత్రం ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ అయిపోయిందని చెబుతున్నారని రైతులు వాపోతున్నారు.

Read Also: డిజైన్, ఇంటీరియర్, ఇంజిన్ లైనప్‌లో భారీ మార్పులు.. డిసెంబర్ 10న కొత్త తరం Kia Seltos వచ్చేస్తుంది..!

అయితే, కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 3.70 లక్షల ఎకరాల వరి సాగు జరగగా, అందులో 60 శాతం కోతలు ఇప్పటికే పూర్తయ్యాయి. పంట చేతికి వచ్చే సమయానికి దిత్వా తుఫాన్ ఎఫెక్టుతో నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశించిన మేర దిగుబడి కూడా రాలేదని అంటున్నారు. మరో రెండు రోజులు వర్షాలు వచ్చే అవకాశం ఉండడంతో ఎక్కువ డబ్బులు చెల్లించి వరి కోతలు చేయించుకోవాల్సి పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.

Read Also: REDMI 15C 5G Lunch: 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా.. 10 వేలకే రెడ్‌మీ నుంచి పవర్ ఫుల్ ఫోన్!

ఇక, అధికారులు మాత్రం కార్యాలయాల్లో కూర్చొని సమావేశాలు నిర్వహించడమే తప్ప తమ దగ్గరు వచ్చి సమస్యలు తెలుసుకోవడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. గోనె సంచులు వేల సంఖ్యలో సిద్ధంగా ఉన్నాయనే ప్రకటనలు చేస్తున్నారు తప్పా.. తమకు మాత్రం అందజేయడం లేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో గుట్టలు, గుట్టలుగా ధాన్యపు రాశులు దర్శనమిస్తున్నాయి.

Exit mobile version