Minister Kollu Ravindra: నకిలీ మద్యంపై పోలీసులు సమగ్ర విచారణ జరపాలి అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కుట్రలు అన్నీ కృష్ణా జిల్లా నుంచి జరగడం దురదృష్టకరం అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ డేటా సెంటర్ రావడం పట్ల లోకేష్, చంద్రబాబులను అభినందించాలని పేర్కొన్నారు. సముద్రంలో నుంచి ఒక డేటా కేబుల్ రాబోతోంది.. పదేళ్ళలోపే ఏపీ స్వరూపమే మారబోతోంది.. రాష్ట్రానికి అద్భుతమైన అభివృద్ధి రాబోతోంది.. మాజీమంత్రి అమర్నాథ్ కు మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. నవంబర్ 15న కూడా ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ విశాఖలో జరగబోతోంది.. 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం.. రాష్ట్రంలో అస్ధిరత తీసుకు రావాలని చూస్తున్నారు.. పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని మతాల మధ్య చిచ్చుగా చేయాలని చూశారని మంత్రి రవీంద్ర చెప్పుకొచ్చారు.
Read Also: HCA: హెచ్‌సీఏ సెలక్షన్ కమిటీపై ఉప్పల్ పీఎస్‌లో కేసు నమోదు!
అయితే, కులాల్ని మతాలని రెచ్చగొట్టాలని చూస్తున్నారు అని మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. గోరంట్ల మాధవ్ కు మాట్లాడే అర్హత ఉందా.. కియా మోటార్స్ ను ఏపీకి రాకుండా చేశారు.. చాలా ఇండస్ట్రీస్ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాయంటే గోరంట్ల మాధవ్ కారణం కాదా అన్నారు. బందరులో ఉన్న వైన్ షాపులన్నీ పేర్ని నాని మనుషులవే.. అన్ని షాపుల ముందూ డివైజ్ పెడుతున్నాం.. సామాన్యడు కూడా ఆ డివైజ్ లలో చెక్ చేసుకోవచ్చు.. సహజ మరణాలను కూడా లిక్కర్ మరణాలుగా చూపించాలని చూస్తున్నారు.. ప్రజలను భయాందోళనలకు గురి చేయాలని చూస్తే మీ ప్రయత్నాలు సాగవు అని కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
