NTV Telugu Site icon

Perni Nani Family in Hiding: అజ్ఞాతంలో పేర్ని నాని కుటుంబ సభ్యులు..!

Perni Nani Family

Perni Nani Family

Perni Nani Family in Hiding: మాజీ మంత్రి, కృష్ణాజిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.. మచిలీపట్నం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు పేర్ని నాని సతీమణి జయసుధ.. అయితే, పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదైన విషయం విదితమే.. రేషన్‌ బియ్యం అక్రమాలపై అధికారుల ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. సివిల్ సఫ్లై గోదాంలో బియ్యం అవకతవకలు జరిగాయంటూ కేసు నమోదైంది.. ప్రధాన నిందితురాలిగా పేర్ని నాని సతీమణి జయసుధ.. ఆయన పీఏలపై కేసు నమోదు చేశారు పోలీసులు.. మరోవైపు.. గత మూడు రోజుల నుంచి అందుబాటులో లేకుండా పోయిందట పేర్ని నాని కుటుంబం.. మూడు రోజుల నుంచి ఫోన్‌ కూడా స్విచాఫ్ వస్తుందంటున్నారు.. కేసు నమోదు నేపథ్యంలో.. అరెస్ట్‌ భయంతోనే పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటుందని ప్రచారం సాగుతోంది..

Read Also: Sanjay Raut: మహాయుతి ప్రభుత్వంపై శివసేన ఎంపీ తీవ్ర విమర్శలు.. ఈవీఎంల ఆలయాన్ని నిర్మించాలంటూ..!

Show comments