Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు బిజీ బిజీగా గడిపారు.. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గుడువర్రు గ్రామంలో పంచాయితీరాజ్ గ్రామీణావృద్ధిశాఖ చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.. ఆ తర్వాత గుడివాడ మండలంలోని మల్లయ్యపాలెం గ్రామంలో రక్షిత తాగునీటి పథకానికి సంబంధించిన కార్యక్రమాలను పరిశీలించారు.. పల్లె పండుగలో ఇచ్చిన మాట ప్రకారం, కంకిపాడు మండలం గొడవర్రు గ్రామం మీదుగా తోట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామానికి నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు పవన్ కల్యాణ్.. కంకిపాడు బస్టాండ్ నుంచి గొడవర్రు మీదుగా రొయ్యూరు వెళ్ళే రహదారిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా రూ.3.75 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ పనుల నాణ్యత పర్యవేక్షణ చేశారు.
Read Also: Air India: తొలి ఫ్లైట్ జర్నీలో మద్యం, ఫుడ్ ఖాళీ చేసేసిన సూరత్ ప్యాసింజర్స్!
ఇక, గుడివాడ చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రూరల్ మండలం మల్లాయపాలెం వాటర్ వర్క్స్ వద్ద పవన్ కు స్వాగతం పలికారు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కూటమినేతలు… మల్లాయపాలెం త్రాగునీటి చెరువు.. హెడ్ వాటర్ వర్క్స్ పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్.. ఫిల్టర్ బెడ్ల ద్వారా నీటిని శుద్ధి చేయు విధానాన్ని.. పవన్ కు వివరించారు కలెక్టర్ బాలాజీ.. గ్రామీణ ప్రాంతాల్లో నిటి సరఫరా వ్యవస్థ ఫోటో ప్రదర్శన తిలకించారు.. నీటి శుద్ధి పరీక్షలను వీక్షించారు.. ఇటీవల పవన్ కల్యాణ్ చొరవతో విడుదలైన రూ.2.27 కోట్లతో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో మరమ్మత్తులు చేసిన ఫిల్టర్ బెడ్ల ద్వారా సరఫరా అవుతున్న స్వచ్ఛమైన త్రాగునీటి నమూనాలను పరిశీలించారు.. మరోవైపు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను చూసేందుకు ప్రజలు.. అభిమానులు పెద్ద సంఖ్యలు తరలివచ్చారు.. అభిమానులకు అభివాదాలు చేస్తూ.. మంగళగిరి తిరుగు ప్రయాణమయ్యారు పవన్ కల్యాణ్..