కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాలువలోకి స్నానానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన బాపులపాడు మండలం ఏ. సీతారాంపురం గ్రామంలో జరిగింది. ఏలూరు కాల్వలోకి స్నానం చేయడానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు చనిపోయారు. ఆదివారం కావడంతో సరదాగా కాలువలోకి స్నానానికి వెళ్లారు చిన్నారులు. మృతి చెందిన ఇద్దరు చిన్నారులు ఏ.సీతారాంపురం గ్రామానికి చెందిన రెడ్డి అజయ్, పోల యశ్వంత్ కృష్ణగా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం.. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న వీరపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. తమ చిన్నారుల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Krishna District: విషాదం.. కాలువలోకి స్నానానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి
- కృష్ణా జిల్లాలో విషాదం
- ఏలూరు కాలువలోకి స్నానానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి.
Show comments