Gudlavalleru Engineering College Incident: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు కళాశాల ఘటనపై విచారణకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.. బాలికల హాస్టల్ లో హిడెన్ కెమెరాలు పెట్టారని విద్యార్థుల ఫిర్యాదుపై దుమారం రేగిన విషయం విదితమే కాగా.. ఇప్పటికే ఈ ఘటనపై విచారణ చేపట్టారు పోలీసులు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు లోతైన విచారణ చేపట్టారు పోలీసులు.. అయితే, కంప్యూటర్ ఎమర్జన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) ద్వారా ఆధారాల సేకరణ చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.. రేపు CERT టీం ముందుకి వచ్చి ఏమైనా ఆధారాలు ఉంటే ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటలకు సమర్పించాలని విద్యార్దులను కోరారు పోలీసులు..
Read Also: GWMC : జీడబ్ల్యూఎంసీ పాత భవనం కూల్చివేతలో అధికారుల నిర్లక్ష్యం
కాగా, కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై సీఎం చంద్రబాబు ఇప్పటికే సీరియస్ అయిన విషయం విదితమే.. కాగా, శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ వాష్ రూంలలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 పైగా వీడియోలు రికార్డ్ చేసి అమ్ముకున్నారనే ఆరోపణలతో కాలేజీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఇక, ఆరోపణలు రావడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత చేపట్టారు. ఈ కేసులో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించిన విషయం విదితమే.. అయితే, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద విద్యార్థులు ఆందోళనలు రచ్చగా మారాయి.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. వి వాంట్ జస్టిస్ అంటూ అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగడం.. ఆ తర్వాత కాలేజీ యాజమాన్యం సెలవులు ప్రకటించడం చర్చగా మారింది.