NTV Telugu Site icon

Pawan Kalyan: తెలుగు రాష్ట్రాలకు రామోజీ ఓ ఉద్యమకారుడు.. రాజీపడని ఆయన తీరు నాకెంతో స్ఫూర్తి..

Pawan

Pawan

Pawan Kalyan: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు, తెలుగు రాష్ట్రాలకు రామోజీరావు ఓ ఉద్యమకారుడు.. రాజకీయ దాడులెన్నో తట్టుకుని ఎక్కడా రాజీపడని ఆయన తీరు నాకెంతో స్ఫూర్తి అని పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఏపీ ప్రభుత్వం నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ.. దశాబ్దంన్నర నలిగి నలిగి.. ఆయన ఏపీలో కూటమి విజయ వార్త విన్నారో లేదో అని ఆందోళన పడ్డా.. కానీ, రామోజీరావు ఏపీలో విజయాన్ని 24 గంటలు సంపూర్ణంగా ఆస్వాదించారట అన్నారు. రామోజీరావు ప్రజాపక్షపతి.. ఆయనతో మాట్లాడినంత సేపూ ప్రజా శ్రేయస్సు అoశాలే ఎక్కువ ఉంటాయి.. దేశానికి, ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో తరచూ చెప్పేవారు.. రాజకీయ దాడులెన్నో తట్టుకుని ఎక్కడా రాజీపడని ఆయన తీరు నాకెంతో స్ఫూర్తి అన్నారు పవన్‌..

Read Also: CM Chandrababu: ఒకే ఒక ఎన్టీఆర్, ఒకే ఒక రామోజీరావు.. ఇద్దరూ ఇద్దరే..

సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించేందుకు రామోజీరావు ఎంతో కృషి చేసారు అని గుర్తుచేసుకున్నారు పవన్‌ కల్యాణ్.. పత్రికా విలువల్లో ఎక్కడా రాజపడని తీరు సాహసోపేతం అని ప్రశంసించారు.. చివరి రోజుల్లో కూడా కూటమి విజయ వార్త విని సంతోషంగా పరమపదించారు.. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎవరి స్థాయిలో వారు రామోజీరావు లా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న ఏ పార్టీని ఆయన వదల్లేదన్నారు. రామోజీరావు జర్నలిజం వారసత్వ సంపదను ఎంత అంది పుచ్చుకున్నామా అని ప్రతీ ఒక్కరూ గుర్తించాలని సూచించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..