ఎగువ నుంచి కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతుంది. ప్రకాశం బ్యారేజ్ కు పులిచింతల ప్రాజెక్ట్, మున్నేరు, పాలేరు, కట్లేరు ప్రాంతాల నుంచి ఈరోజు సాయంత్రానికి సుమారు లక్ష క్యూసెక్స్ వరకు వరద నీరు చేరనుంది. వరద ఉధృతి పై అధికారులను మరింత అప్రమత్తం చేసారు కృష్ణా జిల్లా కలెక్టర్ జె. నివాస్. అయితే ప్రస్తుతo ఇన్ ఫ్లో 33,061 అవుట్ ఫ్లో 31,500 క్యూసెక్కులుగా ఉంది. వరద ముంపు ప్రభావిత అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ జె. నివాస్… జగ్గయ్యపేట నుంచి ఇబ్రహీంపట్నం వరకు 18 మండలాల తహసీల్దార్ల్ అప్రమత్తంగా ఉండాలి అని… చిన్న లంక, పెద్ద లంక ప్రాంతాల్లో పటిష్టమైన చర్యలు తీసుకోవాలి అని సూచించారు. ఇక కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, పశువులు-గొర్రెలు వదలడం లాంటివి చేయరాదు అని పేర్కొన్నారు.
ఎగువ నుంచి కృష్ణానదికి పెరుగుతున్న వరద ఉధృతి…
