NTV Telugu Site icon

Kothakota: పీఎస్‌లోనే ఏఎస్‌ఐ రాసలీలలు.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న సీఐ

Police Station

Police Station

ఏ కష్టం వచ్చినా పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కుతారు.. అక్కడైనా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉంటుంది.. ఏం జరిగినా.. మొదటగా వచ్చేవాళ్లు కూడా పోలీసువాళ్లే.. అయితే, అందులో కొందరు తప్పుడుదార్లు తొక్కడంతో.. మొత్తం డిపార్ట్‌మెంట్‌కే మచ్చగా మారుతున్న ఘటనలు ఉన్నాయి.. ఓ ఏఎస్‌ఐ రక్షభట నిలయాన్ని తన పడక గదిగా మార్చుకుని అడ్డంగా దొరికిపోయాడు… డ్యూటీలో ఉన్న సమయంలో మద్యం సేవించడమే కాదు.. ఏకంగా ఓ మహిళను పోలీస్‌ స్టేషన్‌కే తీసుకుని వచ్చి రాసలీలలు సలిపాడు.. అయితే, అతడి పాపం పండింది.. మహిళతో ఉన్న సమయంలో.. ఆ ఏఎస్‌ఐను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు సీఐ..

Read Also: Astrology : ఆగస్టు 29, ఆదివారం దినఫలాలు

పోలీస్‌ స్టేషన్‌లోనే రాసలీలలకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే… అనకాపలిజిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్లో అప్పారావు అనే వ్యక్తి ఏ.ఎస్.ఐ.గా పనిచేస్తున్నాడు.. తాజాగా ఫుల్ట్‌గా మద్యం సేవించిన అప్పారావు.. పోలీస్టేషన్‌లోనే ఓ మహిళతో కులికాడు.. మద్యం మత్తులో ఓ మహిళను స్టేషన్ కు తీసుకుని వచ్చిన ఏ.ఎస్.ఐ. అప్పారావు కామకలాపాల్లో మునిగిపోయాడు.. అదే సమయంలో పీఎస్‌కు వచ్చిన సీఐ.. రెడ్‌ హ్యాండెడ్‌గా వారిని పట్టుకున్నారు.. మహిళను మందలించి వదిలేసిన సీవై.. పోలీసుల పరువు తీసిన అప్పారావుపై చర్యలకు సిఫార్సు చేశారు.. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు కొత్తకోట పోలీసులు నివేదిక పంపారు.