NTV Telugu Site icon

Kodali Nani: చిరంజీవికి కొడాలి నాని కౌంటర్.. ఆ ఇద్దరికి సలహాలిస్తే బాగుంటుంది

Kodali Nani To Chiranjeevi

Kodali Nani To Chiranjeevi

Kodali Nani Strong Counter To Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన తాజా వ్యాఖ్యలకు మాజీమంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీలో చాలామంది పకోడీగాళ్లు ఉన్నారని.. వాళ్లు ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాళ్లకు కూడా ‘ప్రభుత్వం గురించి మనకెందుకు’ అని సలహాలు ఇవ్వొచ్చు కదా అని సూచించారు. మనం డాన్స్‌లు, ఫైట్స్, యాక్షన్ గురించి చూసుకుందామని చెప్పొచ్చు కదా అని చిరుకి కౌంటర్ ఇచ్చారు. ఆ ఇద్దరికీ సలహాలు ఇస్తే బాగుంటుందని పేర్కొన్నారు.

Manoj Tiwary Retirement: 5 రోజుల వ్యవధిలోనే.. రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న భారత క్రికెటర్!

కాగా.. అంతకుముందు చిరంజీవి వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్‌లో పరోక్షంగా మంత్రి అంబటి రాంబాబు, వైసీపీ ప్రభుత్వంపై చురకలు అంటించారు. ‘‘మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, ప్రాజెక్టులు గురించి ఆలోచించాలి. పేదల కడుపునింపే దిశగా ప్రయత్నాలు చేయాలి. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు. అంతేగానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా సినీ పరిశ్రమపై పడతారేంటి’’ అని చిరంజీవి వ్యాఖ్యానించారు. అలాగే.. డిమాండ్ ఉన్న వారికి పారితోషికం ఎక్కువే ఇస్తారని కూడా చెప్పారు. దీంతో.. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

CM YS Jagan: మరోసారి ఉదారత చాటుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

ఇదిలావుండగా.. ‘బ్రో’ సినిమాలో తనని ఉద్దేశించి ఒక సన్నివేశం జోడించారని మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకపడిన విషయం తెలిసిందే. అప్పుడు ఆయన పవన్ తన పారితోషికం వివరాల్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు. పారితోషికం చెప్పలేని వాడు, రాజకీయాల్లో పారదర్శకంగా ఎలా ఉంటాడని నిలదీశారు. ఆ వ్యాఖ్యలకు కౌంటర్‌గానే చిరంజీవి పై విధంగా స్పందించినట్టు తెలుస్తోంది. దీంతో.. కొడాలి నాని ఆ వెంటనే రంగంలోకి దిగి, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Show comments