Site icon NTV Telugu

చంద్రబాబు, దేవినేని ఉమపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

ఆరు నెలల్లో టీడీపీని బీజేపీలో విలీనం చేయటం ఖాయమని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గోబెల్స్ అయితే అంతకు మించిన వ్యక్తి దేవినేని ఉమా అని… ఉన్నది లేనట్లు అభూత కల్పనలు చేస్తుంటాడని మండిపడ్డారు. నిన్న ఉద్దేశ్యపూర్వకంగా వెళ్లి అక్కడి ప్రజలపై దుర్భాషలాడాడని… మా పార్టీ నేత కారు అద్దాలు పగలగొడితే దాన్నే దేవినేని ఉమా కారు అని చూపించారని ఆరోపించారు.

read also :ఏపీ కరోనా అప్డేట్‌..తగ్గిన కేసులు

దాడి చేయడమే కాకుండా దళితులను దుర్భాషలాడారని… పోలీసులను కూడా బెదిరించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని నిప్పులు చెరిగారు. అక్కడ జరిగే మైనింగ్ క్వారీలు నేను పుట్టక ముందు నుంచి ఉన్నాయని… అత్యంత ఎక్కువ మైనింగ్ టీడీపీ హయాంలోనే జరిగిందన్నారు. అవినీతి చక్రవర్తి ఈ రాష్ట్రంలో ఒక్క చంద్రబాబేనని… ఇటువంటి పిచ్చి పనులు చేస్తే ఉమానే కాదు చంద్రబాబుని కూడా పోలీసు శాఖ వదలదని హెచ్చరించారు. చంద్రబాబు, ఉమా లాంటి వారి మాటలు రైతులు నమ్మొద్దని సూచనలు చేశారు.

Exit mobile version