Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ డీఎన్‌ఏ లేకుండా చేయాలని టీడీపీ కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి రాకుండా చంద్రబాబు తొక్కేస్తున్నాడని కొడాలి నాని విమర్శించారు. ఎన్టీఆర్ డీఎన్ఏ అయిన జూనియర్ ఎన్టీఆర్‌ను కాదని నారా లోకేష్‌ను అందలెక్కించడం ద్వారా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని కొడాలి నాని పరోక్షంగా ఆరోపించారు. అలాగే ఏపీని ఆక్రమించాలని ఓ కులం పన్నాగాలు పన్నుతోందని.. టీడీపీ కుట్రలను అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Read Also: నరేష్ ముగ్గురు మాజీ భార్యల గురించి ఈ విషయాలు తెలుసా?
మరోవైపు తనను మంత్రివర్గం నుంచి తొలగించడంపై జరుగుతున్న చర్చపైనా కొడాలి నాని స్పందించారు. తనను కాదని పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే జోగి రమేష్‌ను మంత్రిని చేయడంపై ప్రత్యర్ధులు చేస్తున్న విమర్శలకు ఆయన జవాబిచ్చారు. జోగి రమేష్ మంత్రి అయితే తాను, మరో మాజీ మంత్రి పేర్ని నాని, గన్నవరం ఎమ్మెల్యే వంశీ మంత్రులైనట్లేనని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ కలిస్తే ఎంత దమ్ము , ధైర్యం ఉంటుందో జగన్ ఒక్కరిలోనే అంత ఉంటుందని నాని వ్యాఖ్యానించారు. జగన్ లాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలపై ఉందన్నారు.
