విజయనిర్మల కుమారుడు నరేష్. అతడి తండ్రి పేరు కేఎస్ మూర్తి

నరేష్ చైల్డ్ ఆర్టిస్టుగా, హీరోగా ఇండస్ట్రీలో తన సత్తా చాటుకున్నాడు

నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. కానీ ఎవరితోనూ కలిసి జీవించడం లేదు

నరేష్‌ హీరోగా రాణిస్తున్న సమయంలోనే కొరియోగ్రాఫర్ శ్రీను కుమార్తెతో పెళ్లి జరిగింది.

వీళ్లిద్దరికీ నవీన్ విజయ్‌కృష్ణ అనే కుమారుడు ఉన్నాడు. నవీన్ నందిని నర్సింగ్ హోం అనే సినిమాలో నటించాడు

కొన్ని విభేదాల కారణంగా మొదటి భార్యకు నరేష్ విడాకులు ఇచ్చేశాడు

అనంతరం దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమార్తె రేఖ సుప్రియను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు కూడా ఓ కుమారుడు ఉన్నాడు.

రెండో భార్యకు కూడా విడాకులు ఇచ్చిన తర్వాత రమ్య రఘుపతిని మూడో వివాహం చేసుకున్నాడు

రమ్య రఘుపతి ఏపీ మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నయ్య కుమార్తె. 

నరేష్-రమ్య రఘుపతి దంపతులకు కూడా ఓ బాబు ఉన్నాడు.

మూడో భార్య రమ్యకు విడాకులు ఇవ్వకుండానే పవిత్ర లోకేష్‌తో నరేష్ తిరుగుతూ మీడియా కంట పడుతున్నాడు.