NTV Telugu Site icon

Kodali Nani: మార్చి 22 ఉగాదిన సీఎం జగన్ చేతుల మీదుగా టిడ్కో ఫ్లాట్ల ప్రారంభం

Kodali Nani Tidco Plots

Kodali Nani Tidco Plots

Kodali Nani On Tidco Plots: మార్చి 22న ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా టిడ్కో ఫ్లాట్లను ప్రారంభిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని స్పష్టం చేశారు. నిర్మాణాలన్నీ విజయవంతంగా పూర్తయ్యాయని అన్నారు. గుడివాడ మల్లాయిపాలెం లే-అవుట్‌లోని టిడ్కో ఫ్లాట్లు, జగనన్న హౌసింగ్ కాలనీను కొడాలి నానితో పాటు కలెక్టర్ రంజిత్ భాష పరిశీలించారు. లే అవుట్‌లో జరుగుతున్న అభివృద్ధిని కలెక్టర్ యంత్రాంగం ఆ ఇద్దరికి వివరించింది. అనంతరం కొడాలి నాని మాట్లాడుతూ.. నాడు పెద్ద మనసుతో వైయస్సార్, నేడు జగన్మోహన్ రెడ్డి పేదల సొంతింటి కల నిజం చేస్తున్నారన్నారు. టిడిపి హయాంలో నామమాత్రంగానే టిడ్కో నిర్మాణాలు జరిగాయని విమర్శించారు. జగనన్న కాలనీలో మెటల్ రోడ్ల నిర్మాణాలకు 8 కోట్ల మంజూరు అయ్యాయని తెలిపారు. టిడ్కో ఫ్లాట్ల ప్రారంభోత్సవ సభలో గుడివాడకు ఏం చేశారో ముఖ్యమంత్రి వివరంగా చెప్తారన్నారు. గుడివాడ శివారు కాలనీల అభివృద్ధికి రూ.26 కోట్లు మంజూరు చేశామన్నారు. గుడివాడ రూరల్, నందివాడ మండలాల్లో త్రాగు నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రూ. 160 కోట్లతో టెండర్ పూర్తయ్యిందన్నారు. గుడివాడలో వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు వివిధ దశలో ఉన్నాయన్నారు.

Bopparaju Venkateswarlu: ఇది ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం కాదు.. హక్కుల కోసం న్యాయపోరాటం

అంతకుముందు.. ఏపీలో రాబోయే ఎన్నికలపై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. 175కి 175 సీట్లు గెలవాలని సీఎం జగన్ కోరుకుంటున్నారని.. టీడీపీ , జనసేన కలిసి వస్తే 18 చోట్ల మాత్రమే టైట్ ఫైట్ నడుస్తుందని అన్నారు. కేవలం 18 చోట్ల మాత్రమే నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉంటుందని.. మిగిలిన అన్ని చోట్లా వార్ వన్ సైడేనని జోస్యం చెప్పారు. జగన్ ఎవరిని నిలబెడితే, వారే తప్పకుండా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్.. జగన్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. వారు ఎన్ని నిందలేసినా ప్రజల కోసం సీఎం భరిస్తున్నారన్నారు. ఇక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ తర్వాత రాష్ట్రానికి భారీగా పరిశమ్రలు వస్తాయన్నారు. అలాగే.. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని పేదవాడి ఆర్థిక బలోపేతానికి సీఎం జగన్ సంక్షేమ పథకాల రూపంలో ఖర్చు చేస్తున్నారని.. ఏ రాష్ట్రంలో ప్రభుత్వం ఇవ్వని సంక్షేమ పథకాలను పేదవారి కోసం ఏపీలో మాత్రమే అందిస్తున్నామన్నారు. రాష్ట్రం అభివృద్ధి అంటే రోడ్లు వేయటం నిర్మాణాలు కట్టడమే కాదని.. ప్రతి పేదవాడిని ఆర్థికంగా బోలోపేతం చేయడమని వివరించారు.

MLC Kavitha on IT HUB: నిజామాబాద్‌లో త్వరలో ఐటీ హబ్‌ ప్రారంభం

Show comments