NTV Telugu Site icon

Kodali Nani : చంద్రబాబు దొంగల ముఠా నాయకుడిలా వ్యవహరిస్తున్నారు

నకిలీ సర్టిఫికెట్‌ వ్యవహరంలో టీడీపీ నేత అశోక్‌బాబును సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలని నాని మీడియాతో మాట్లాడుతూ.. అశోక్‌ బాబు ఏం తప్పు చేశారని సిగ్గులేకుండా అడుతున్నారని, చంద్రబాబు దొంగల ముఠా నాయకుడిలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అశోక్‌బాబు దొంగ సర్టిఫికెట్లతో ప్రమోషన్లు పొందాడని, అయినా.. అశోక్‌బాబుపై కంప్లైంట్‌ చేసింది తన సహోద్యోగేనని ఆయన అన్నారు. ఇలా వేరొకరి రావాల్సిన పదోన్నతలు నకిలీ సర్టిఫికెట్లతో తను అనుభవించడం తప్పుకాదా అని ఆయన టీడీపీని ప్రశ్నించారు.

దొంగ సర్టిఫికెట్లు పెట్టారని నిర్థారణ అయిన తర్వాతే అశోక్‌బాబును పోలీసులు అరెస్ట్‌ చేశారన్నారు. నీకులా నాలుగు పేపర్లతో డబ్బాలు కొట్టించుకొని అధికారంలోకి వచ్చినట్లు కాదని, సీఎం జగన్‌ స్వతహాగా దమ్ముధైర్యంతో అధికారంలోకి వచ్చారని ఆయన అన్నారు. ప్రభుత్వానికి అశోక్‌ బాబు అయినా.. చంద్రబాబు అయినా ఒక్కటేనని ఆయన అన్నారు. చంద్రబాబు గురించి తెలిసే ప్రజలు 23 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారని ఆయన విమర్శించారు.