Kodali Nani Fires On TDP Chandrababu Naidu: ఎంపీ గోరంట్ల మాధవ్ మార్ఫింగ్ వీడియో వ్యవహారంపై టీడీపీ, చంద్రబాబు మీద మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్టీఆర్ కుమార్తె ఆత్మహత్యను కవర్ చేసుకోవడానికే.. మాధవ్ మార్ఫింగ్ వీడియోను టిడిపి ప్రచారం చేస్తోందని ఆరోపించారు. టీడీపీ నేతలకు దమ్ముంటే.. మాధవ్ అసలు వీడియోని బయటపెట్టాలని సవాల్ విసిరారు. వైసీపీ తల, టిడిపి బాడీలతో ఎడిటింగ్ చేసిన వీడియోను రికార్డు చేసి.. దాన్ని అమెరికా ల్యాబ్‌కు పంపితే ప్రయోజనమేంటని ప్రశ్నించారు. ఐ-టిడిపి, లోకేష్, చంద్రబాబు ఆధ్వర్యంలోనే ఎంపీ మాధవ్ వీడియో ఎడిటింగ్ జరిగిందని అన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన టిడిపి.. టీఎల్పీ పార్టీగా నామ కారణం చేసుకోవాలన్నారు.
ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి జాతీయ జెండా ఎగరేసే అర్హత లేదని టిడిపి నేతల వ్యాఖ్యలపై కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అల్లూరి, సుభాష్ చంద్రబోస్‌ల మాదిరి వ్యవస్థలపై పోరాడిన ఒక్కడే యోధుడు జగన్ అని చెప్పారు. సైకిల్ గుర్తు కోసం అమ్మాయిలను పంపిన చరిత్ర చంద్రబాబుది అని.. ఇప్పుడు అధికారం కోసం దిగజారి, అమ్మాయిలను అడ్డం పెట్టుకొని విష ప్రచారం చేస్తున్న చరిత్ర టీడీపీదని ఆరోపణలు చేశారు. లింగాలను, అమ్మాయిలను అడ్డుపెట్టుకునే వ్యక్తులు ప్రతిపక్షంలో ఉండడం దౌర్భాగ్యమన్నారు. మాధవ్ వీడియోలో ఎవరికీ కనబడనిది, టిడిపి నాయకులకు మాత్రమే ఎలా కనబడిందో?నని సందేహం వ్యక్తం చేశారు. జగన్ మాదిరి ప్రజల తరఫున పోరాటం చేయడం చేతకాక.. చంద్రబాబు అండ్ కో మాధవ్ లింగం పట్టుకుని వేలాడుతున్నారని ఎద్దేవా చేశారు.
వైసిపి ఎంపీలు, ఎమ్మెల్యేలపై నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తామని కొడాలి నాని హెచ్చరించారు. ప్రజాదరణ ఉన్న జగన్మోహన్ మోహన్ రెడ్డిని ప్రతిపక్షంలో కూర్చోపెట్టేందుకు టిడిపి ఇంతలా దిగజారడం దుర్మార్గమన్నారు. వైసీపీకు, జగన్మోహన్ రెడ్డికి చెడ్డ పేరు తేవాలనుకునేవారు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. జగన్ పబ్జి ఆడుతున్నారంటూ కామెంట్స్ చేసిన వారు.. క్యాంప్ ఆఫీసుకు వెళ్లి చూశారా? అని ప్రశ్నించారు. అమ్మాయిలను అడ్డం పెట్టుకొని.. టిడిపి కుట్రలు చేస్తుందని ఏడాదిన్నర క్రితమే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయని కొడాలి నాని వెల్లడించారు.